కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ ఫోర్జరీ.. డాక్టర్‌ అరెస్ట్‌

కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ను ఫోర్జరీ చేసిన ఘటనలో 34ఏళ్ల డాక్టర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఆయనకు సహాయం చేసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ ఫోర్జరీ.. డాక్టర్‌ అరెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 5:15 PM

Doctor arrest Delhi: కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ను ఫోర్జరీ చేసిన ఘటనలో 34ఏళ్ల డాక్టర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఆయనకు సహాయం చేసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఖుష్ బీహారీ పరషర్ అనే డాక్టర్‌, అమిత్ సింగ్‌ అనే వ్యక్తితో కలిసి కరోనా టెస్ట్‌ రిపోర్ట్‌లను ఫోర్జరీ చేస్తున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు హౌజ్‌ ఖాస్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు నర్సులకు కరోనా టెస్ట్ చేసి రిజల్ట్‌ పంపాలంటూ ఓ బిజినెస్‌మ్యాన్,‌ పరషర్‌ని కోరారు. దీంతో ఆ ఇద్దరి పేర్ల మీద రిపోర్ట్‌లను ఫోర్జరీ చేసి ఆ బిజినెస్‌మ్యాన్‌కి పంపాడు పరషర్‌. అయితే తన పేరు తప్పుగా వచ్చిందంటూ అందులోని ఓ క్లైంట్, సదరు‌ డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్లింది. అయితే అక్కడి రికార్డులో ఆ క్లైంట్ పేరు లేదంటూ వారు చెప్పారు. దీంతో ఆ క్లైంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేయగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

పలువురి నుంచి శాంపిల్స్‌ని సేకరించే పరషర్‌, ఎలాంటి టెస్ట్‌లు చేయకుండానే రిపోర్టలను ఫోర్జరీ చేసి వారికి పంపేవాడని పోలీసులు తేల్చారు. ఆ రిపోర్ట్‌లపై గుర్తింపు పొందిన డయాగ్నోస్టిక్‌ల పేర్లను పెట్టేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.‌ మరోవైపు ఈ విషయాన్ని పరషర్‌ కూడా ధృవీకరించాడు. గత రెండున్నర నెలలుగా తాను ఫోర్జరీ రిపోర్టులు ఇస్తున్నానని.. ఒక్కో దానికి రూ.2,400 ఛార్జ్ చేశానని అతడు అన్నాడు. వ్యక్తి లక్షణాలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ రిపోర్ట్‌లను ఇచ్చానని, ఇప్పటి వరకు 75 ఫోర్జరీ రిపోర్ట్‌లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఇక ఈ కేసుపై పోలీసులు విచారణ కొనసాగుతోంది.

Read More:

శశికళ బంగళాపై ఐటీ శాఖ సీరియస్

జేఈఈ-నీట్ పరీక్షలు.. ఆరు రాష్ట్రాల మంత్రుల పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీం

Latest Articles