శశికళ బంగళాపై ఐటీ శాఖ సీరియస్

శశికళ బంగళాపై ఐటీ శాఖ సీరియస్ అయ్యింది. పోయెస్ గార్డెన్‌లోని జయ నివాసానికి ఎదురుగా శశికళ భారీ భవనాన్ని నిర్మిస్తోంది.

శశికళ బంగళాపై ఐటీ శాఖ సీరియస్
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 4:20 PM

Sasikala Bungalow Chennai: శశికళ బంగళాపై ఐటీ శాఖ సీరియస్ అయ్యింది. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయ నివాసానికి ఎదురుగా శశికళ భారీ భవనాన్ని నిర్మిస్తోంది. చిన్నమ్మ బంధువుల పేరును కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల శశికళకు చెందిన 65 ప్రాంతాల్లో 300 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఐటీ శాఖ గుర్తించింది. అందులో పోయెస్ గార్డెన్‌లోని నూతన భవనం ఉంది. ఈ క్రమంలో ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 90 రోజుల్లోపు నిర్మాణంలోని భవనానికి సంబంధించి ఆధారాలను సమర్పించాలని, లేదంటే భవనాన్ని జప్తు చేస్తామని ఐటీ శాఖ వెల్లడించింది. కాగా అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తోన్న శశికళ.. త్వరలో బయటకు రానుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన తరువాత పోయెస్ గార్డెన్ నుంచి రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని శశికళ ప్లాన్ చేసుకున్నారు. అయితే తాజాగా ఐటీ యాక్షన్‌తో ఆమె ప్లాన్‌కి చెక్ పడింది.

Read More:

జేఈఈ-నీట్ పరీక్షలు.. ఆరు రాష్ట్రాల మంత్రుల పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీం

దర్శకుడిని ఫిక్స్ చేసుకున్న చెర్రీ.. దసరాకు ప్రకటన

Latest Articles