Superstar Rajinikanth: ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది

బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కల్కి సినిమాలోనూ నటిస్తున్నారు అమితాబ్ ఈ సినిమాలో ఆయన అశ్వథామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ కు సంబందించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే అమితాబ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది.

Superstar Rajinikanth: ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
Rajinikanth
Follow us

|

Updated on: May 04, 2024 | 3:15 PM

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోతో పాటు సినిమాల షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు ఈ స్టార్ నటుడు. బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కల్కి సినిమాలోనూ నటిస్తున్నారు అమితాబ్ ఈ సినిమాలో ఆయన అశ్వథామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ కు సంబందించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే అమితాబ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. రజినీకాంత్ నెక్స్ట్ మూవీలో అమితాబ్ నటిస్తున్నారు.

ప్రస్తుతం రజినికాంత్ ‘ వేట్టైయాన్ ‘ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా రజినీకాంత్. ఈ సినిమాలో చాలా మంది సెలబ్రెటీలు నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ కూడా రజనీకాంత్‌తో స్క్రీన్‌ను పంచుకోనున్నారు. తమిళలో తెరక్కెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అమితాబ్, రజినీకాంత్ కలిసి ఉన్నకొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వెట్టయన్’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ స్వయంగా ఈ ఫోటోలను షేర్ చేసింది.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి ఉన్న ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ పోస్ట్ చేసింది. భారతీయ సినిమా దిగ్గజాలు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ముంబయిలో వేట్టైయాన్ సెట్స్‌లో ఉన్నారు’ అని లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. రజనీకాంత్ , అమితాబ్ ఇద్దరూ చాలా స్టైలిష్ గా కనిపించారు. చాలా మంది ఈ ఫోటోకు హార్ట్ ఎమోజీని కామెంట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. రజనీ, అమితాబ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటించారు. పవర్ ఫుల్ యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇలాంటి యాక్షన్ సినిమాలనే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.