Dil Raju: హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడమే సీఎం లక్ష్యం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్..

టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో నాగార్జున, వెంకటేశ్, అల్లు అరవింద్, పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.

Dil Raju: హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడమే సీఎం లక్ష్యం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్..
Dil Raju, Cm Revanth Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2024 | 9:02 PM

టాలీవుడ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలోని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం (డిసెంబర్ 26) ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు సీఎం రేవంత్ రెడ్డి విలువైన మార్గదర్శకత్వం, సూచనలు అందించారని దిల్ రాజు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమ సమావేశం సానుకూలంగానే జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి దూరం వచ్చిందని జరుగుతున్ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని అన్నారు.

ఈ మేరకు నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఈ భేటీపై వస్తున్న నెగెటివ్ వార్తల్లో నిజం లేదు. జరగని ఘటనలను జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 0.5% వ్యతిరేకత కూడా లేదు. నిజానికి సినిమా పరిశ్రమకి ఈ ప్రభుత్వం చాలా మద్దతునిస్తోంది. సీఎం గారు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం తన సలహాలు, సూచనలను పంచుకున్నారు. హైదరాబాద్‌ను భారతీయ సినిమాకే కాకుండా హాలీవుడ్ నిర్మాణాలకు కూడా హబ్‌గా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఆయనిచ్చిన సలహాలు, సూచనలపై దృష్టి పెడతాం. తదుపరి సమావేశంలో వివరణాత్మక ప్రతిపాదనను ఆయన ముందు ఉంచుతాము’ అని అన్నారు.

అలాగే డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు తీసుకుని వారం రోజులు అయ్యిందని.. యూఎస్ వెళ్లి రాగానే ముఖ్యమంత్రిని కలిశానని అన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే చర్చించామని.. బెనిఫిట్ షోలు, టికెట్ రేటు అనేది చిన్న విషయమని .. ఇంటర్నేషనల్ గా తెలుగు చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడమే తన అజెండా అని అన్నారు దిల్ రాజు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.