Balakrishna: బాలకృష్ణ హీరోగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక చిత్రం.. సన్నాహాలు మొదలు పెట్టిన ప్రముఖ నిర్మాత.

|

Dec 09, 2022 | 8:19 AM

అఖండతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేశారు నట సింహం బాలకృష్ణ. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న బాలయ్య కుర్ర హీరోలకు పోటిస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఇదే గ్యాప్‌లో ఆహా ఓటీటీ వేదికగా అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోతో పాటు పలు ప్రకటన్లలోనూ..

Balakrishna: బాలకృష్ణ హీరోగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక చిత్రం.. సన్నాహాలు మొదలు పెట్టిన ప్రముఖ నిర్మాత.
Balakrishna New Movie
Follow us on

అఖండతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేశారు నట సింహం బాలకృష్ణ. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న బాలయ్య కుర్ర హీరోలకు పోటిస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఇదే గ్యాప్‌లో ఆహా ఓటీటీ వేదికగా అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోతో పాటు పలు ప్రకటన్లలోనూ నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా ఓ అంతర్జాతీయ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ తెలిపారు. శుక్రవారం సి.కళ్యాణ్‌ పుట్టిన రోజు, ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి చినజీయర్‌ స్వామి సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను కళ్యాణ్‌ అమ్యుస్మెంట్‌ పార్క్‌ ఆరంభోత్సవం రోజున ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇక నిర్మాత కళ్యాణ్‌ అమ్ముస్మెంట్ పేరుతో ఓ పార్క్‌ను నిర్మిస్తున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ.. ‘తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో దీన్ని నిర్మిస్తున్నాం. ప్రజలకు కావాల్సిన వినోదం, ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు.. అన్నీ ఇందులో ఉంటాయి. దాదాపు రూ.200కోట్ల ప్రాజెక్ట్‌ ఇది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను నేను చేయడం దేవుడిచ్చిన వరంలా భావిస్తా’నని చెప్పుకొచ్చారు.

ఇక సంక్రాంతికి సినిమాల విడుదలపై కౌన్సిల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కళ్యాణ్‌.. చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల నిర్మాతలు ఫిర్యాదు చేయకుండానే ఈ విషయంలో కౌన్సిల్‌ మాట్లాడటం వందశాతం తప్పు అని అభిప్రాయపడ్డారు. ఆ సంగతి వాళ్లకీ చెప్పానని.. కీడు చేసే గుణం ఉన్న వాళ్లు ఎంత పెద్ద హిట్లు కొట్టినా.. చివరికి జీరోలుగానే పరిశ్రమ నుంచి వెళ్లారు తప్ప ఎవరూ హీరోలుగా వెళ్లలేదన్నారు. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో నిలబడ్డాం. ఆ పరిశ్రమకు ఉపయోగపడమని మనవి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..