బొమ్మ పడితే నటిస్తా.. బొరుసు పడితే నటించను.. కాయిన్ ఎగురవేసి నిర్ణయాన్ని చెప్పిన హీరోయిన్.. ఎవరంటే ?

|

Feb 02, 2021 | 3:38 PM

విక్టరీ వెంకటేష్ నటించిన 'ప్రేమంటే ఇదేరా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ప్రితిజింటా. ఇక ఈ మూవీ తర్వాత పలు సినిమాలలో నటించి

బొమ్మ పడితే నటిస్తా.. బొరుసు పడితే నటించను.. కాయిన్ ఎగురవేసి నిర్ణయాన్ని చెప్పిన హీరోయిన్.. ఎవరంటే ?
Follow us on

విక్టరీ వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ప్రితిజింటా. ఇక ఈ మూవీ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది ఈ సొట్ట బుగ్గల సుందరి. తెలుగులోనే కాకుండా ప్రితి జింటా బాలీవుడ్‏లో కూడా టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. జనవరి 31తో ప్రీతి జింటా 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ తర్వాత ప్రీతి జింటా అంట్రపెన్యూర్‏గా మారింది. అయితే తాను సినిమాల్లోకి రావడానికి కాయిన్ ఎగురవేసి నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ వెల్లడించింది.

“నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో కుటుంబానికి అండగా నిలబడేందుకు తొందరగా పోస్ట్ గ్యాడ్యుయేషన్ పూర్తిచేసి.. ముంబైకి వచ్చేశాను. ఆ తర్వాత అక్కడ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసాను. అదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ నన్ను మొదటి సారిగా తర రమ్ పమ్ సినమాలో నటించాలని అడిగారు. ఆయన అలా అడిగేసరికి నేను ముందుగా షాక్ అయ్యాను. కానీ కనాకు అప్పుడు సినిమాలపై అంత ఇంట్రెస్ట్ లేదు. విధి నిర్ణయం అదే అయితే నేను తప్పక నటిస్తాను అని చెప్పి కాయిన్ ఎగురవేసాను. బొమ్మ పడితే నటిస్తా.. బొరుసు పడితే చేయను అని అనుకున్నాను. కానీ బొమ్మ పడింది. దీంతో వెంటే ఓకే చెప్పేసాను” అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ మూవీ తర్వాత నేను మణిరత్నం దిల్ సే సినిమాలో నటించా.. ఆ మూవీనే ముందుగా విడుదలైంది. తర్వాత కొన్నాళ్ళకు తర రమ్ పమ్ సినిమాను సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలతో కొత్త టీం ఆ సినిమాను పూర్తిచేసింది. అది కూడా విధి నిర్ణయమే కావచ్చు.. కానీ ఆ మూవీ ప్లాప్ అయ్యింది అంటూ తెలిపింది ప్రీతి.

Also Read:

Pagal Movie Update: విశ్వక్ సేన్ ‘పాగల్’ ఫస్ట్‏లుక్ రిలీజ్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..