AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌‌లో నన్ను ఎనిమిది సార్లు బ్యాన్ చేశారు.. వారణాసి సినిమా నుంచి కూడా తీసేయాలని ప్రచారం చేశారు

ప్రకాష్ రాజ్ తన కెరీర్‌లో సినీ పరిశ్రమ ద్వారా ఎదుర్కొన్న నిషేధాలు, మా ఎన్నికలలో ఓటమి, తనపై వచ్చిన ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటుడిగా కొనసాగుతూనే తన మనస్సాక్షి మేరకు సామాజిక విషయాలపై మాట్లాడతానని, దానిని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజలు తనను ఆదరిస్తున్నారని, కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

టాలీవుడ్‌‌లో నన్ను ఎనిమిది సార్లు బ్యాన్ చేశారు.. వారణాసి సినిమా నుంచి కూడా తీసేయాలని ప్రచారం చేశారు
Prakash Raj
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2026 | 12:33 PM

Share

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన సినీ జీవితంలో ఎదుర్కొన్న పలు వివాదాలు, పరిశ్రమ నిషేధాలు, మా ఎన్నికల పరాజయం, తన వ్యక్తిత్వంపై వచ్చిన ఆరోపణలు, సామాజిక అంశాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజకీయ పార్టీలతో తనకు సమస్యలున్నాయని, గతంలో మా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సినీ పరిశ్రమలోని చాలా మందితో సమస్యలు వచ్చాయని ఆయన అన్నారు. మా ఎన్నికల పరాజయం గురించి మాట్లాడుతూ, “ఓడిపోయాడా, ఓడించారా?” అని ప్రశ్నించారు. లోపల ఏం జరిగిందో తెలియదని, చిరంజీవి వంటి పెద్దలు మద్దతిచ్చినా తనను ఓడించారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తనను గతంలో ఎనిమిది సార్లు బహిష్కరించిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. తనపై “లేటుగా వస్తాడు, పొగరు, డబ్బింగ్‌కు రాడు” వంటి ఫిర్యాదులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, దీనిపై ఆయన స్పందిస్తూ, “రెండు చేతులు కలవకపోతే చప్పట్లు రావు కదా. ఒకసారి నేను ఉండొచ్చు, ఒకసారి వాళ్ళు కూడా తప్పు చేసి ఉండొచ్చు” అన్నారు. తన కెరీర్ ప్రారంభం నుంచీ తాను ఇలాగే ఉన్నానని, ఐదు భాషల్లో పాపులర్ అయిన తర్వాత ఇలా అయిపోలేదని వివరించారు.

తనది ఒక వ్యక్తిత్వమని, అది అత్యాచారమో, దొంగతనమో కాదని, కేవలం ప్రవర్తనకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. రాత్రి షూటింగ్ చేసి ఉదయం రావడం వంటి పరిస్థితులుంటాయని, ఐదు భాషల్లో పనిచేస్తూ, ప్రయాణాలు చేస్తూ ఇలాంటివి సాధారణమని ఆయన అన్నారు. తన పనితీరుపై ఎవరూ వేలెత్తి చూపలేదని ప్రకాష్ రాజ్ అన్నారు. “పరభాషా నటులు” అనే సమస్య ప్రజలకు లేదని ప్రకాష్ రాజ్ బలంగా నొక్కి చెప్పారు. ఆంధ్ర, తెలంగాణలలో తనను “మనవోడు ప్రకాష్ రాజ్” అని పిలుస్తారని, బొమ్మరిల్లు, అంతఃపురం, పోకిరి, ఒక్కడు, సిరిమల్లె చెట్టు, ఆకాశమంత వంటి చిత్రాల ద్వారా ప్రజలు తనను తమవాడిగా చూసుకుంటున్నారని తెలిపారు.

అలాగే తమిళనాడులో ఎంగ ఆళు, కన్నడలో మనవోడు, హిందీలో హమారా ఆద్మీ అని పిలవడం ప్రజలు తనపై చూపే ప్రేమని ప్రకాష్ రాజ్ వివరించారు. కొందరు తన చిత్రాలను బ్యాన్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఉదాహరణకు కేజీఎఫ్ సమయంలో “ప్రకాష్ రాజ్… కేజీఎఫ్ 2లో ఉన్నాడు సినిమాని ఆడనివ్వరు” అన్నారని, దృశ్యం 3 విడుదలైనప్పుడు “ఇక నుంచి ప్రకాష్ రాజుని బ్యాన్ చేయాలి” అన్నారని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఆ సినిమాలు భారీగా కలెక్ట్ చేశాయని, ప్రజలకు ఈ విషయాల్లో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. తాను నటిస్తున్న వారణాసి సినిమా నుంచి సైతం బ్యాన్ చేయాలని ట్విట్టర్‌లో ప్రచారం చేసి, రాజమౌళిని ప్రకాష్ రాజ్ ను ఎందుకు తీసుకున్నావు.? అని తిడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దేశంలో సినిమాను బ్యాన్ చేయడం అంత సులువు కాదని, ప్రజలకు ఏం చేయాలో తెలుసని ఆయన అన్నారు. తన సామాజిక స్పృహ గురించి మాట్లాడుతూ, అది దేశం కోసమో, ఏదైనా పార్టీ కోసమో కాదని, తన మనస్సాక్షి కోసం చేస్తున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. “తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండలేను” అని, తాను ఒక్కడినైనా మాట్లాడాలి కదా అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us