AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: ఆ హీరో మార్కెటింగ్ ప్లాన్ అదిరిపోతుంది.. ప్రొడ్యూసర్స్ దాన్నే ఫాలో అవ్వాలి : రామ్ గోపాల్ వర్మ

భారతీయ చిత్ర పరిశ్రమలోని మార్కెట్ లాజిక్‌లపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన విశ్లేషణను పంచుకున్నారు. పెద్ద హీరోలు భారీ ప్రాజెక్టులలో నటించడానికి బలవంతం అవుతారని, ఎందుకంటే ప్రేక్షకులు వారి నుండి అలాంటి అంచనాలనే పెట్టుకుంటారని RGV పేర్కొన్నారు. బాహుబలి వంటి చిత్రాల విజయం, నటీనటులు తెలియకపోయినా విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని నిరూపించింది.

RGV: ఆ హీరో మార్కెటింగ్ ప్లాన్ అదిరిపోతుంది.. ప్రొడ్యూసర్స్ దాన్నే ఫాలో అవ్వాలి : రామ్ గోపాల్ వర్మ
Rgv
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2026 | 11:52 AM

Share

ప్రస్తుత చిత్ర పరిశ్రమలోని ఆర్థిక, క్రియేటివ్ సవాళ్లపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన విశ్లేషణను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. పెద్ద హీరోలు అధిక పారితోషికం తీసుకుంటూ, భారీ బడ్జెట్ చిత్రాలలోనే నటించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు వారి నుంచి అధిక అంచనాలను పెట్టుకోవడం దీనికి కారణం అన్నారు. ఉదాహరణకు, మన ఇండస్ట్రీ పెద్ద హీరోలు 127 అవర్స్ వంటి ప్రయోగాత్మక చిత్రం చేస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా.? అన్నది ప్రశ్నార్థకం. స్టార్‌డమ్ అంటే కేవలం నటుడి స్క్రీన్ ప్రజెన్స్ అని, కథ కంటే కాస్టింగ్ ఫ్యాక్టర్ ముఖ్యమని ఆర్జీవీ పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ అనుసరించిన వినూత్న మార్కెటింగ్ వ్యూహాన్ని వర్మ ప్రస్తావించారు. ఆమీర్ గజిని వంటి పెద్ద హిట్ తర్వాత, తారే జమీన్ పర్ వంటి చిన్న, ఆర్ట్-హౌస్ సినిమాను తక్కువ బడ్జెట్‌తో నిర్మించి, దానిని గజిని అమ్మిన ధరలో 10వ వంతుకే అమ్మేశారు. ఈ లాజిక్ ప్రకారం, తక్కువ ధరలో అమ్మి, తక్కువ వసూళ్లు వచ్చినా సినిమా విజయం సాధించినట్లు అవుతుంది, దానివల్ల పెట్టుబడిపై రాబడి పెరుగుతుంది. ఇది భారతీయ సినీ పరిశ్రమలో చాలా మంది అనుసరించని లాజిక్ అని ఆర్జీవీ అన్నారు. భారీ బడ్జెట్ కారణంగా రాధే శ్యామ్ వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదని, బాహుబలి మాత్రం నటులు హిందీ ప్రేక్షకులకు తెలియకపోయినా, భారీ విజువల్స్ కారణంగా విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఆర్జీవీ తన సొంత చిత్రాలైన శివ, సత్యలను ఉదాహరణగా చూపుతూ, తనకు ఆనందం కలిగించిన కథలనే తక్కువ బడ్జెట్‌తో, వాస్తవిక లొకేషన్లలో, పక్కా ప్లాన్ తో తీశానని వివరించారు.

సినిమాకు ఏం అవసరమో దానికే ఖర్చు చేశానని, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో చాలా మందికి ఆడియన్స్ టేస్ట్ గురించి తక్కువ అవగాహన ఉంటుందని, ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో లేదా ఫ్లాప్ అవుతుందో అర్థం చేసుకోలేరని ఆర్జీవీ అన్నారు. అలాగే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అనే ఇరానియన్ చిత్రాన్ని ఇండియాలో తార రం పం పేరుతో రీమేక్ చేసిన విధానాన్ని వివరిస్తూ, అసలు సినిమా వెనుక ఉన్న ఉద్దేశ్యం (“పిల్లల కోసం సినిమా తీయడం”) మారిపోయి, వ్యాపార లాభాల కోసం ప్రయత్నించినప్పుడు ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో ఆర్జీవీ ఉదహరించారు. హానెస్టీ అలాగే మెయిన్ పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వడం వల్ల చిత్రనిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం, గదర్ 2 , యానిమల్, స్త్రీ 2 వంటి విభిన్న చిత్రాలు విజయం సాధిస్తుండటాన్ని బట్టి, ప్రేక్షకులు ఏదైనా చూస్తారని స్పష్టమవుతోందని, కాబట్టి చిత్రనిర్మాతలు తమ సొంత నమ్మకాన్ని అనుసరించడమే సరైన మార్గమని ఆర్జీవీ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us