
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం సాహో. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ఓ సైడ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరోవైపు ప్రమోషన్లు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీని మొదట ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం అవ్వడం వల్ల ఈ నెల 30కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సాహో వాయిదా పడటంతో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సాహో ఒకేసారి విడుదల కానుండగా.. ఇందుకోసం కొంతమంది తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి హీరో ప్రభాస్, నిర్మాతలు యూవీ క్రియేషన్స్ థ్యాంక్స్ చెప్పారు.
ఈ నెల 30న విడుదల కాబోతున్న సాహోకు దారి ఇచ్చేందుకు కొంతమంది తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు సినిమాలు సాహో కోసం వాయిదా పడ్డాయి. ఈ విషయంలో ఆ చిత్ర నిర్మాతలకు చాలా రుణపడి ఉన్నాం. ఎంతో గొప్ప మనసుతో వారు సాహోకు దారి ఇచ్చినందుకు కృతఙ్ఞతలు అంటూ ప్రభాస్, యూవీ క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
కాగా భారీ యాక్షన్ ఎంటర్‌గా తెరకెక్కిన సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Extremely thankful for producers across all the languages for clearing the way for #Saaho and helping for a bigger release.
Action begins in cinemas from 30th Aug!#Prabhas @ShraddhaKapoor @sujeethsign @arunvijayno1 @UV_Creations @itsBhushanKumar @TSeries #30AugWithSaaho pic.twitter.com/PGPxaone89— UV Creations (@UV_Creations) August 6, 2019