Salaar: సలార్ సినిమాను పక్కగా ప్లాన్ చేస్తోన్న మేకర్స్.. ఇంగ్లీష్‌లో రిలీజ్ కోసం ఇలా..

|

Mar 23, 2023 | 4:19 PM

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్

Salaar: సలార్ సినిమాను పక్కగా ప్లాన్ చేస్తోన్న మేకర్స్.. ఇంగ్లీష్‌లో రిలీజ్ కోసం ఇలా..
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడంతో.. ఇప్పుడు నెస్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఇక ఈ సినిమానుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.

తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమా రెండు పార్టులు చేస్తారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను ఇంగ్లిష్‌లో కూడ రిలీజ్‌ కానుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ లో ఉండేలా తెరకెక్కిస్తున్నారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు త్వరలో షురూ చేస్తారట.. ఇంగ్లిష్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ఈ సినిమాలో పాటలు లేకుండా.. కొన్ని సీన్స్ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారట, ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుందట. అన్ని భాషలు కలిపి భారీ మొత్తంలో ఈ మూవీ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది.