
Radhe Shyam: ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోను వెండి తెరపై చూడక రెండేళ్లు గడుస్తుండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆతృతతో ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రాధేశ్యామ్ వచ్చేస్తుందని అంతా ఆశపడ్డారు. అయితే థార్డ్ వేవ్ రూపంలో మరోసారి అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గడంతో సినిమాను మార్చి 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రిరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకున్న ఈ సినిమా మళ్లీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టే పనిలో పడింది.
ఇందులో భాగంగానే ప్రేమికుల దినోత్సం రోజున (ఫిబ్రవరి 14) వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది చిత్ర యూనిట్. నైట్ థీమ్ పార్టీ పేరుతో కొత్త రకంగా ప్రమోషన్ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని కెమిస్ట్రీ క్లబ్‌లో ప్రత్యేకంగా సెట్ వేయనున్నారు. సినిమా కథను ప్రతిబింబించేలా ఈ సెట్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఇలాంటి థీమ్ పార్టీలు సహజమే అయినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నైట్ థీమ్ పార్టీ చిత్ర యూనిట్ హాజరుకానుంది. ప్రిరిలీజ్ ఈవెంట్ తర్వాత పెద్దగా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టని రాధేశ్యామ్ టీమ్ మరోసారి ప్రచారాన్ని వేగవంతం చేయనుందన్నమాట. ఇక గోపీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: IPL 2022 వేలానికి ముందు తుఫాన్ సెంచరీ.. 57 బంతుల్లో 116 పరుగులు.. ఎవరో తెలుసా..?
BCCI: బీసీసీఐ కొత్త ఆలోచన.. వారందరికి క్రికెట్ ఆడే అవకాశం.. ఎవరు వారు..?
Anand Devarakonda: కొత్త సినిమా షూరు చేసిన ఆనంద్ దేవరకొండ.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో..