Project K: ఆ వార్తలు అవాస్తవం.. ప్రాజెక్ట్ కే సినిమాపై వస్తోన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్..

|

Jun 18, 2022 | 9:15 AM

Project K: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్‌ కె. మహానటితో ప్రశంసలు అందుకున్న నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) మొదటిసారి..

Project K: ఆ వార్తలు అవాస్తవం.. ప్రాజెక్ట్ కే సినిమాపై వస్తోన్న రూమర్లపై  క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్..
Prabhas Deepika
Follow us on

Project K: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్‌ కె. మహానటితో ప్రశంసలు అందుకున్న నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) మొదటిసారి నేరుగా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది. సైన్స్‌ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ రూమర్లు వస్తున్నాయి. ఇటీవల దీపికా అస్వస్థతకు గురికావడంతో ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలను కోరాడంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్లపై ప్రాజెక్ట్‌ కె చిత్రబృందం స్పందించింది. షూటింగ్‌ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ షూటింగ్‌లో పాల్గొన్న దీపిక హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో కూడా చేరింది. దీంతో ఆప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ‘ సినిమా షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. ముందుగా షెడ్యూల్‌ చేసుకున్నట్లే షూటింగ్ సజావుగా జరుగుతోంది’ అని నిర్మాత అశ్వనీదత్‌ క్లారిటీ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం దీపిక, అమితాబ్‌ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లోని సీన్స్‌ ఈ నెల 20తో పూర్తవుతాయట. ఆ తర్వాత ఈ నెల 21 నుంచి ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరగనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..