‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’.. పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్..!

Vakeel Saab Teaser: పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు...

కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు.. పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్..!
Vakeel Saab Review

Updated on: Jan 14, 2021 | 6:16 PM

Vakeel Saab Teaser: పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేశారు. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’ అని పవర్ స్టార్ చెప్పే డైలాగు ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది.

ఇక టీజర్‌లో పవన్ ఎలివేషన్స్ సింప్లీ సూపర్బ్. మొత్తానికి టీజర్ మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ అని చెప్పాలి. కాగా, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.