Hero Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్.. ఈసారి రవితేజ డైరెక్టర్‏తో కలవనున్న జనసేనాని..

|

Jan 23, 2021 | 7:08 PM

రీఎంట్రీ తర్వాత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమాను పూర్తిచేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు పవన్. ఈ

Hero Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్.. ఈసారి రవితేజ డైరెక్టర్‏తో కలవనున్న జనసేనాని..
Follow us on

రీఎంట్రీ తర్వాత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తిచేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు పవన్. ఈ మూవీ తర్వాత మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‏లో నటించనున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్‏తో పాటు హీరో రానా కూడా నటించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. తాజాగా పవన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

రాక్షసుడు మూవీ డైరెక్టర్ రమేష్ వర్మతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్‏కు రమేష్ స్టోరీని కూడా వినిపించాడట. కథ నచ్చడంతో పవన్ వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రమేష్ వర్మ టాలీవుడ్ మాస్ మాహారాజా రవితేజతో కలిసి ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యక పవన్ సినిమాను ప్రారంభించినున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

‘రంగ్ దే’ కంటే ముందే రానున్న నితిన్ ‘చెక్’.. విడుదల తేదీని ఖరారు చేసిన చిత్రయూనిట్..

రామ్ కొత్త సినిమా కోసం ఆ మాస్ డైరెక్టర్ ? మళ్లీ యాక్షన్ వైపే అడుగులేస్తున్న యంగ్ హీరో..