ఓటీటీలో పవన్‌ ‘వకీల్‌ సాబ్’..!‌

| Edited By:

Sep 09, 2020 | 3:21 PM

కరోనాతో సినిమా ఇండస్ట్రీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లు మూసేయడంతో పలు

ఓటీటీలో పవన్‌ వకీల్‌ సాబ్..!‌
Follow us on

Pawan Kalyan Vakeel Saab: కరోనాతో సినిమా ఇండస్ట్రీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లు మూసేయడంతో పలు సినిమాలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా లేకపోవడంతో మరికొన్ని మూవీలు ఆన్‌లైన్‌ విడుదలకు లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ నటిస్తోన్న వకీల్ సాబ్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయనున్నారా..! ఇప్పుడు ఈ ప్రశ్న ఫిలింనగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ మూవీకి సంబంధించి షూటింగ్ కొంత మాత్రమే పెండింగ్‌లో ఉంది. పవన్ కల్యాణ్ రెడీ అంటే మిగిలిన ఉన్న షూటింగ్‌ని పూర్తి చేసేందుకు మూవీ యూనిట్ రెడీగా ఉంది. అయితే దిల్ రాజు నిర్మించిన ‘వి’ ఇటీవల విడుదలైంది. ఈ మూవీని మొదట్లో థియేటర్లలోనే తీసుకు వచ్చేందుకు యూనిట్ చాలా ప్రయత్నించింది. అయితే పరిస్థితులు అనుగుణంగా లేకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఇక పవన్ ‘వకీల్ సాబ్’‌ కోసం దిల్ రాజుకు ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ భారీ డీల్‌ని ఆయన ముందు ఉంచిందట. అయితే ఆ ఆఫర్‌ని దిల్ రాజు సున్నితంగా తిరస్కరించారట.

రెండేళ్ల తరువాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం కావడం, ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటంతో దిల్ రాజు ఓటీటీకి నో చెప్పారట. అంతేకాదు ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే, ఈ మూవీని విడుదల చేసినప్పటికీ పవన్‌ అభిమానులు కచ్చితంగా థియేటర్‌కి వస్తారని భావిస్తున్న దిల్ రాజు.. ఆ ఢీల్‌కి నో చెప్పినట్లు తెలుస్తోంది. సో.. పవన్ ఫ్యాన్స్‌ వకీల్ సాబ్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

Read More:

వొడాఫోన్ ఐడియా సీఈవోకు మూడేళ్లు ‘నో’ శాలరీ

అంతర్వేది ఆలయ ఈవోగా ఎర్రంశెట్టి భద్రాజి బాధ్యతలు