పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెలుగులో ఈ సినిమా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
.
లాక్డౌన్ తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను నగరంలోని నిజాం కళాశాలలో చిత్రీకరిస్తున్నారు. దీంతో వకీల్ సాబ్ షూటింగ్ సమాచారం తెలుసుకున్న అభిమానులు పవన్‌ను కలవడానికి భారీగా షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చారు. తన కోసం వచ్చిన అభిమానులకు పవన్ నమస్కారిస్తూ కొందరితో సెల్ఫీలు దిగారు. దీంతో పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ సెట్ నుంచి అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. దిల్‌రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.