Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ స్టామినాకు ఇంతకంటే నిదర్శనం కావాలా.? మతిపోగొడుతోన్న జల్సా రీ రిలీజ్‌ రికార్డ్స్‌..

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు వినిపిస్తే చాలు ఫ్యాన్స్‌ ఉరిమే ఉత్సాహంతో గంతులేస్తారు. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్‌ ఉంది. పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా వస్తుందంటే పండగ వాతావరణం...

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ స్టామినాకు ఇంతకంటే నిదర్శనం కావాలా.? మతిపోగొడుతోన్న జల్సా రీ రిలీజ్‌ రికార్డ్స్‌..

Updated on: Sep 02, 2022 | 10:53 AM

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు వినిపిస్తే చాలు ఫ్యాన్స్‌ ఉరిమే ఉత్సాహంతో గంతులేస్తారు. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్‌ ఉంది. పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా వస్తుందంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పవర్‌ స్టార్‌ సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. నేడు (సెప్టెంబర్‌ 2) పవన్‌ ఫ్యాన్స్‌ను ఓ పండగ రోజు. అభిమానులు పవన్‌ పుట్టిన రోజును గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. పవన్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ మూవీస్‌లో ఒకటైన జల్సా చిత్రాన్ని రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ జల్సా 4కే వెర్షన్‌ను విడుదల చేశారు.

దీంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 2008 ఏప్రిల్‌ 2న జల్సా సినిమా విడుదలైన సమయంలో ఎలాంటి కోలాహలం ఉందో నేడు మళ్లీ విడుదలైన సమయంలోనూ అదే సందడి నెలకొంది. జల్సా సమయంలో చిన్న పిల్లల్లా ఉన్న వారు కూడా ఇప్పుడు థియేటర్లకు క్యూకడుతుండడం పవన్‌ క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే 14 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఏకంగా 600కిపైగా స్పెషల్‌ షోస్‌తో జల్సా ట్రెండ్‌ సెట్‌ చేసింది. ‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ సెట్‌ చేస్తాను’ అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పే డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఓవైపు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూనే మరోవైపు సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న పవన్‌ కళ్యాణ్‌కు మనం కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా.!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..