Vijay Sethupathi: మక్కల్ సెల్వనా మజాకా.. టాలీవుడ్, కోలీవుడ్ అయిపోయింది.. ఇప్పుడు బాలీవుడ్..

ఏ ఇండస్ట్రీలోనైనా.. అటు రెమ్యూనరేషన్ .. ఇటు క్రేజు.. ఒక్క్క హీరోలకు మాత్రమే దక్కుతుందని ఫీలింగ్ అందరిలో ఉంది. కాని అలాంటిదేం ఇప్పుడు లేదని అంటున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

Vijay Sethupathi: మక్కల్ సెల్వనా మజాకా.. టాలీవుడ్, కోలీవుడ్ అయిపోయింది.. ఇప్పుడు బాలీవుడ్..
Vijay Sethupathi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 02, 2022 | 7:03 AM

ఏ ఇండస్ట్రీలోనైనా.. అటు రెమ్యూనరేషన్ .. ఇటు క్రేజు.. ఒక్క్క హీరోలకు మాత్రమే దక్కుతుందని ఫీలింగ్ అందరిలో ఉంది. కాని అలాంటిదేం ఇప్పుడు లేదని అంటున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi). అనడమే కాదు.. ఏకంగా ఇదే విషయాన్ని ప్రూఫ్ చేశాడు కూడా..ఇక ఇప్పటికే కోలీవుడ్‌ లో హీరోగా స్టార్ ఇమేజ్‌ కమాయించిన విజయ్‌ సేతుపతి. విలన్ గాను మెప్పించారు. తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా షారుఖ్ సినిమాలో విలన్‌గా..!

ఇప్పటికే సౌత్‌లో విలన్ గా జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న ఈ హీరో.. ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన విలనిజాన్ని చూపించనున్నారు. అట్లీ డైరెక్షన్లో షారుఖ్ హీరోగా చేయబోయే సినిమాలో విలన్‌ గా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారట అట్లీ. అయితే పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో.. విజయ్‌ సేతుపతి ఉంటే.. సౌత్‌లో మార్కెట్ వస్తుందని ఫీలైన షారుఖ్ … సేతుపతిని ఈ సినిమాలోకి తీసుకున్నారట. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లో విలన్ పాత్రలతో మెప్పించిన విజయ్ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ లో విలన్ గా రాణించనున్నడన్నమాట. అయితే ఈ సినిమాను ఓకే చేయడానికి ఈ క్రేజీ హీరో 21కోట్లు డిమాండ్ చేశారట. అందుకు షారుఖ్ కూడా ఓకే చెప్పారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త నిజమై.. సినిమా సూపర్ హిట్ అయితే విజయ్ సేతుపతికి బాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం అంటున్నారు సేతుపతి ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి