ఆ క్రేజీ రీమేక్‌లో పవన్‌-రానా..!

| Edited By:

Oct 07, 2020 | 5:56 PM

మలయాళంలో పెద్ద విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.

ఆ క్రేజీ రీమేక్‌లో పవన్‌-రానా..!
Follow us on

Pawan Kalyan Rana: మలయాళంలో పెద్ద విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రీమేక్ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటివరకు పలువరి కాంబినేషన్‌ పేర్లు వినిపించాయి. బాలయ్య-రానా, వెంకటేష్‌-రానా, పవన్ కళ్యాణ్-రవితేజ ఇలా పలు కాంబోలు వినిపించాయి. అయితే ఈ కాంబోలో ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం మరో క్రేజీ కాంబో పవన్‌-రానా పేరు ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

ఇక తాజాగా పవన్‌- రానా కాంబో ఈ రీమేక్ కోసం వినిపిస్తోంది. ఈ ఇద్దరు ఇందులో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. అన్నీ కుదిరితే వకీల్‌ సాబ్‌ని పూర్తి చేసిన తరువాత పవన్‌ ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ఈ రీమేక్‌కి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read More:

సీనియర్‌ దర్శకుడు కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం

రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్‌