Liger Movie: లైగర్‌ నుంచి మాస్‌ బీట్‌ ప్రోమో వచ్చేసింది.. స్టెప్పులతో కుమ్మేసిన అనన్య, విజయ్‌..

|

Jul 08, 2022 | 4:38 PM

Liger Movie: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ లైగర్‌ మూవీ యూనిట్‌ అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఆగస్టు 25న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో సినిమా...

Liger Movie: లైగర్‌ నుంచి మాస్‌ బీట్‌ ప్రోమో వచ్చేసింది.. స్టెప్పులతో కుమ్మేసిన అనన్య, విజయ్‌..
Follow us on

Liger Movie: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ లైగర్‌ మూవీ యూనిట్‌ అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఆగస్టు 25న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించిన చిత్ర యూనిట్‌ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఇప్పటికే టీజర్‌, ఫస్ట్‌లుక్స్‌తో సినిమాకు ఎక్కడలేని హైప్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లైగర్‌ చిత్రంలోని మాస్‌ బీట్‌కు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అనన్య పాండే, విజయ్‌ దేవవరకొండల మధ్య చిత్రీకరించిన ఈ పార్టీ సాంగ్‌ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది.

‘అక్‌డి పక్‌డి’ అంటూ సాగే పాటలో అనన్య, విజయ్‌ స్టెప్పులతో రచ్చ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్‌ స్పెప్పులతో హోరెత్తించాడు. పాట చిత్రీకరణలో పూరి జగన్నాథ్‌ మార్క్‌ స్పష్టంగా కనిస్తోంది. టీజర్‌తోనే పాటపై హైప్‌ పెంచిన పూరీ, ఫుల్‌ లెంత్‌ సాంగ్‌తో యూట్యూబ్‌ షేక్‌ చేయడం ఖాయమని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పూర్తి పాటను జులై 11న విడుదల చేయనున్నారు. ఈ పాట హిందీ వెర్షన్‌ లిరిక్స్‌ను మోహ్‌సిన్‌ షైక్‌, అజీమ్‌ దయాని అందించగా లిజియో జార్జ్‌ సంగీతం అందించారు. తెలుగు విషయానికొస్తే అనురాగ్‌ కుల్కర్నీ, రమ్య బెహరా ఆలపించారు. భాస్కర భట్ల రవికుమార్‌ లిరిక్స్‌ అందించారు.

ఇవి కూడా చదవండి

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి తొలిసారి తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం కావడం, కరణ్‌ జోహర్‌ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతో బీటౌన్‌లోనూ ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్‌ రెడ్డితో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ లైగర్‌తో తొలిసారి పాన్‌ ఇండియా హీరోగా అవతారమెత్తనున్నాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలవతోన్న ఈ సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..