
గత కొన్ని రోజులుగా, అనేక భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రకంపనలు రేపుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ఇప్పుడు పాక్ ప్రజలు తెగ చూసేస్తున్నారు. ఒక్క పాక్ లోనే కాదు నైజీరియలోనూ ఈ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం గమనార్హం. 1985 నాటి షా బానో కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు హఖ్. కోర్టు రూమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యామీ గౌతమ్ ఇందులో కీలక పాత్ర పోషించింది. న్యాయం కోసం ఒక ముస్లిం మహిళ చేసే చట్టపరమైన పోరాటమే ఈ సినిమా కథ. ఈ ముస్లిం మహిళల హక్కులు, వివాహ సంస్థ, విడాకులు, పితృస్వామ్య మనస్తత్వం అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సుపర్ణ్ ఎస్. వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ ఓ కీలక పాత్రలో నటించాడు.
బాలీవుడ్ ప్రముఖులు అలియా భట్, కియారా అద్వానీ, కరణ్ జోహార్, ఫరా ఖాన్ తదితరులు హఖ్ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘హక్’ చిత్రం విడుదలైన కొన్ని వారాలలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది . ఆ తర్వాత ఈ చిత్రం జనవరి 2న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం పాకిస్తాన్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. పాకిస్తానీ నటులు, న్యాయవాదులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పాకిస్తానీ నటి, రచయిత్రి, నిర్మాత ఫజిలా ఖాజీ ఇన్‌స్టాగ్రామ్‌లో హక్ సినిమా గురించి ఇలా రాసుకొచ్చారు, ‘ హక్ సినిమా భావోద్వేగంగానూ, స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ సినిమా నన్ను ఏడిపించింది. యామి గౌతమ్… నువ్వు అద్భుతంగా నటించావు’ అని ప్రశంసలు కురిపించింది. కాగా హక్ సినిమా రెండవ వారంలోనే ఓటీటీలో 4.5 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.
పాక్, నైజీరియాలో ట్రెండింగ్..
Beyond success… This is a revolution🔥🔥
Critically acclaimed #Haq, starring @yamigautam & @emraanhashmi, now tops Netflix charts in Pakistan and Nigeria after India ✅#EmranHashmi #YamiGautam pic.twitter.com/EyMGXEyXFQ
— Always Bollywood (@AlwaysBollywood) January 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.