
కొన్నాళ్లుగా మూవీ లవర్స్‌ను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్.. హారర్ కంటెంట్ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అలాగే థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలను కేవలం 40 రోజుల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సూపర్ హిట్ సినిమాలో ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు సూపర్ హిట్ హనుమాన్ మూవీ సైతం ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై రూపొందించిన సినిమా ఆర్టికల్ 370. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్, ప్రియమణి కీలకపాత్రలు పోషఇంచారు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 19న జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్ యామీ గౌతమ్, ప్రియమణి అదరగొట్టారని రివ్యూస్ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ తోపాటు కలెక్షన్స్ కూడా ఎక్కువే వచ్చాయి. దాదాపు 105 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో రాజ్ అరుణ్, శివమ్ ఖజురియా, వైభవ్ తత్వవాది, అరుణ్ గోవిల్ కీలకపాత్రలు పోషించారు. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై జ్యోతి దేశ్ పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి శాశ్వత్ సచ్ దేవ్ సంగీతం అందించారు. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్ గా యామీ గౌతమ్, పీఎంవో జాయింట్ సెక్రటరీగా ప్రియమణి నటన సినిమాకై హైలెట్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.