
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ వైవా హర్ష్. యూట్యూబ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన అతడు తెలుగులో అనేక సినిమాల్లో నటించి అలరించాడు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోస్ చిత్రల్లో హస్యనటుడిగా.. స్నేహితుడిగా.. కీలకపాత్రలలో కనిపించి మెప్పించాడు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎలాంటి పాత్రలలోనైనా తనదైన యాక్టింగ్ స్టైల్‌తో అలరించాడు. ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న అతడు హీరోగా నటించిన తొలి చిత్రం సుందరం మాస్టర్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజే ఈచిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఎప్పటిలాగే మరోసారి తన నటనతో నవ్వించాడు హర్ష. ఈ చిత్రాన్ని ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి స్టార్ హీరోస్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సుందరం మాస్టర్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి 28 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. అటు మరో ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లోనూ ఈ సినిమాను చూడొచ్చు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అయితే ట్రైలర్, టీజర్ తో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. పాయింట్ బాగున్నా.. అడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ పండకపోవడంతో ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. దాదాలు నాలుగు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
కథ విషయానికి వస్తే..
అడవి మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే గ్రామానికి ఇంగ్లీష్ టీచర్ కావాలని గ్రామస్తులంతా కలిసి ఆ మండల ఎమ్మెల్యేను కోరుకుంటారు. దీంతో సుందర్ మాస్టర్ ను ఆ ఊరికి టీచర్ గా పంపిస్తారు. కానీ అప్పటికే ఇంగ్లీష్ వచ్చిన ఆ ఊరి వాళ్లంతా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ సుందరం మాస్టర్ ను ఆడుకుంటారు. ఊరంతా కలిసి పెట్టే పరీక్షలో ఫెయిల్ అయితే ఉరి తీసి చంపేస్తామని అతడిని బెదిరిస్తారు. చివరకు సుందర్ మాస్టర్ ఆ పరీక్షలో పాస్ అయ్యాడా ?లేదా.? ఆ ఊరిలో ఉన్న విలువైన వస్తువు ఆచూకిని సుందరం కనిపెట్టాడా ? అనేది సినిమా.
🎓Master home tuitions chepaniki mana intiki ochestunaduuu….ready ga undandi
‘CLASS’IC BLOCKBUSTER #SundaramMasterOnAha from March 28. 🌟@RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/2Sq1JI8tsl
— ahavideoin (@ahavideoIN) March 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.