Gangs Of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

|

Jun 09, 2024 | 10:47 AM

ఇందులో హీరోయిన్ అంజలి కీలకపాత్రను పోషించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్‏లతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మరోసారి తన నటనతో ప్రసంశలు అందుకున్నాడు విశ్వక్.

Gangs Of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Gangs Of Godavari Movie
Follow us on

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే గామి సినిమాతో విజయం అందుకున్న విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఇందులో హీరోయిన్ అంజలి కీలకపాత్రను పోషించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్‏లతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మరోసారి తన నటనతో ప్రసంశలు అందుకున్నాడు విశ్వక్.

ఇదిలా ఉంటే… థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 14న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్మెంట్ చేశారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది చిత్రయూనిట్.

మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ కీలకపాత్రలు పోషించారు. దాదాపు పదకొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎనిమిది రోజుల్లో రూ.19.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ విడుదలైన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. మరీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.