న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం (Virata Parvam). 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వం.. రానా, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విరాటపర్వం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జూలై 1న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ఈశ్వరీ, నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. తెలంగాణలో 1990లో జరిగిన సరళ అనే ఓ మహిళ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని.. ఆమె జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పారు. విప్లవానికి ప్రేమకథను జోడించి అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు వేణు ఉడుగుల.
ట్వీట్..
A relentless quest for love and freedom!
Get ready to experience the world of Virata Parvam, coming to Netflix on 1st of July in Telugu, Malayalam and Tamil! #VirataParvamOnNetflix pic.twitter.com/44ks2WaJLl
— Netflix India South (@Netflix_INSouth) June 29, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.