
ఆ మధ్యన రిలీజైన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కంచిన ఈ మూవీని చూసి ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అలా ఇటీవల ఓ తమిళ సినిమాను చూసి ఆడియెన్స్ కన్నీళ్ల తో బయటకు వచ్చారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీకి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా థియేటర్ కు వెళ్లి మరీ ఈ మూవీని చూశాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.
ఈ మూవీ పేరుకు క్రైమ్ స్టోరీ అయినా ఒక ఎమోషనల్ డెప్త్ లవ్ స్టోరీ ఉంది. అందుకే ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘కదిరవన్’ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే విచారణా ఖైదీని జైలు నుంచి కోర్టుకు తరలించే క్రమంలో అతను తప్పించుకుంటాడు. మరి కదిరవన్ ఆ తప్పించుకున్న ఖైదీని తప్పించుకున్నాడా? అసలు ఈ అబ్దుల్ ఎవరు ? ఆ హత్య కేసు ఏమిటి ? కదిరవన్ ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే ఈ క్రైమ్ డ్రామా సినిమాను చూడాల్సిందే.
It’s an excellent mind blowing, very emotional true love movie 👌💥
బాబోయ్ కన్నీళ్ళు ఆగలేదు
చివరి వరకు ఏం అవుతుంది అని ఇంట్రెస్ట్ గా ఉంది 🔥 క్లైమాక్స్ వెరీ ఎమోషనల్ 😭🥺రియల్ లైఫ్ ఆధారంగా తీసిన మూవీ 👌
ఎక్స్లెంట్ 🔥💥 డోంట్ మిస్ ఇట్ #Sirai #siraionzee5 pic.twitter.com/YLfATwKrnK— ☕🐦 (@naadoprapancham) January 26, 2026
ఈ సినిమా ‘సిరై’. అంటే తమిళంలో జైలు అని అర్థం. విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మా ప్రధాన పాత్రలు పోషించారు. మూడు రోజుల క్రితమే ఈ మూవీ జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. మంచి ఎమోషనల్ మూవీ చూడాలనుకునేవారికి సిరై ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
#Sirai now streaming on @ZEE5India in Telugu, Tamil, Kannada & Malayalam🍿!!#SiraiOnZee5#Zee5#TeluguOTTUpdates#TeluguOTT pic.twitter.com/0ajYaJLxiI
— Telugu OTT Updates (@TeluguOTTUpdts) January 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి