Maharaja: తిరుగులేని ‘మహారాజా’.. ఓటీటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్ సేతుపతి సినిమా

|

Aug 21, 2024 | 8:01 PM

విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం రికార్డు సృష్టించింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. జూన్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా విజయ్ సేతుపతికి 50వ చిత్రం. అనురాగ్ కశ్యప్, సింగం పులి, నట్టి, దివ్య భారతి, అభిరామి, అరుల్దాస్, మునీస్కాంత్, బాయ్జ్ మణికందన్ పలువురు ఈ చిత్రంలో నటించారు.

Maharaja: తిరుగులేని మహారాజా.. ఓటీటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్ సేతుపతి సినిమా
Maharaja
Follow us on

హీరో విజయ్ సేతుపతి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. తమిళ్‌లో హీరోగా సక్సెస్ అయిన విజయ్ సేతుపతి. ఇప్పుడు పాన్ ఇండియా నటుడిగా మారిపోయారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం రికార్డు సృష్టించింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. జూన్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా విజయ్ సేతుపతికి 50వ చిత్రం. అనురాగ్ కశ్యప్, సింగం పులి, నట్టి, దివ్య భారతి, అభిరామి, అరుల్దాస్, మునీస్కాంత్, బాయ్జ్ మణికందన్ పలువురు ఈ చిత్రంలో నటించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహారాజాను ది రూట్, థింక్ స్టూడియోస్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

థియేటర్స్ లో సక్సెస్ అయిన తరువాత మహారాజా చిత్రం గత జూలై 14 న ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో విడుదలైన ఈమూవీ అక్కడ కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్, తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రపంచ దేశాల వరకు చాలా మంది ఆడియన్స్ మహారాజాను తప్పక చూడాలని సిఫార్సు చేస్తున్నారు. అంతే కాకుండా 2024లో అత్యధికంగా వ్యూస్ సాధించిన టాప్ 10 చిత్రాలలో తమిళ చిత్రం మహారాజా ఒక్కటే ఉంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో మిలియన్ వ్యూస్ తో రికార్డ్ బ్రేక్ చేసింది మహారాజ మూవీ. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా 18.6 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

ఇది తమిళ సినిమాకి దక్కిన అతి పెద్ద గౌరవం ఇది. సినీ పరిశ్రమలో కూడా ప్రశంసలు అందుకుంటుంది మహారాజా.  అలాగే మహారాజా సినిమా బేసిక్ ఇతివృత్తంగా లైగింక వేధింపుల ఘటనకు గురైన కూతురు. ఆ తండ్రి ఏం చేశాడు.? నేరస్థులకు ఆ తండ్రి ఎలా శిక్షించాడు అనేది ఈ సినిమా కథ. దేశంలో నిత్యం పెరుగుతున్న లైంగిక నేరాలకు ఇదే సరైన శిక్ష అని పలువురు ఈ సినిమా సన్నివేశాలను షేర్ చేస్తున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి.. 2010లో వచ్చిన తేన్మెచ్చు బరుకట్టు సినిమాతో హీరోగా మారాడు. 14 ఏళ్లలో హీరోగా, సింగర్‌గా, నిర్మాతగా, స్మాల్ స్క్రీన్ షో హోస్ట్‌గా ఎదిగిన ఆయన త్వరలో బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.