కోలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ సినిమా తుఫాన్. తమిళంలో ఈ మూవీ మజై పిడిక్కాథ మణితాన్ పేరుతో తెరకెక్కింది. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్, శరత్ కుమార్, మురళీ శర్మ, పుష్ప డాలీ ధనుంజయ తదితర స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన తుఫాన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓ మోస్తరు వసూళ్లను సాధిస్తోంది. అయితే థియేటర్లలో విడుదలై పట్టుమని 5 రోజులు గడవక ముందే విజయ్ ఆంటోని సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (ఆగస్టు 15) అర్ధరాత్రి నుంచే ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చింది. మరో వారం తర్వాత తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్ మజై పిడిక్కాథ మణితాన్ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైంది. అయితే ఆ సమయానికి పలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవడంతో ఆగస్ట్ 11కు తెలుగు వెర్షన్ తుఫాన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ థియేటర్లలో ఉండగానే ఈ మూవీ ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది.
హాలీవుడ్‌లో విజయవంతమైన పలు యాక్షన్ సినిమాల స్ఫూర్తితో దర్శకుడు విజయ్ మిల్టన్ తుఫాన్ మూవీ కథను తెరకెక్కించాడు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ మూవీని నిర్మించారు. ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకు పనిచేయడం గమనార్హం. విజయ్ ఆంటోనీతో పాటు అచ్చు రాజమణి, రాయ్, హరీ దఫుసీయా, వగు మజన్ తుఫాన్ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సలీం ( విజయ్ ఆంటోనీ) ఓ సీక్రెట్ ఏజెంట్. తన బాస్ (శరత్ కుమార్) అప్పగించిన ఒక కీలక ఆపరేషన్ కోసం అండమాన్ దీవుల్లోని ఓ ఊరికి వస్తాడు. అక్కడ డాలీ (డాలీ ధనుంజయ) అనే వడ్డీ వ్యాపారి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారిలో సౌమ్య(మేఘా ఆకాష్) కూడా ఉంటుంది. మరి డాలీ బారి నుంచి ఆ ఊరి ప్రజలను సలీమ్ ఎలా కాపాడాడు? అసలు సలీమ్…అండమాన్‌కు ఎందుకొచ్చాడు? ఈ కథలో కెప్టెన్ (సత్యరాజ్) పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే తుఫాన్ సినిమా చూడాల్సిందే.
🔔 #VijayAntony‘s Tamil Film #MazhaiPidikkathaManithan (2024).
Now Streaming || Prime Video
Runtime – 2 hr 12 min
Stars – Vijay Antony, R. Sarathkumar , Sathyaraj , Megha Akash , Dhananjay, Murali Sharma
Director – Vijay Milton pic.twitter.com/IrOyo6v2Vk
— OTT Alert (@OTTAlert_) August 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.