Balagam OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ .. బలగం సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

|

Mar 24, 2023 | 6:58 AM

ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో సందడి చేస్తున్న బలగం ఓటీటీ రిలీజ్‌ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది.  తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Balagam OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ .. బలగం సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Balagam Venu
Follow us on

జబర్దస్త్ కమెడియన్‌ వేణు యెల్దండి డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం. స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తూ ఈ సినిమాను రూపొందించారు. కథ నచ్చడంతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బలగం నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆయన కూతురు హన్షిత, హర్షిత్‌ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. చిన్న సినిమా ట్యాగ్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న రిలీజైన ఈ చిత్రం క్లీన్‌ హిట్‌గా నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. మెగాస్టార్‌ చిరంజీవి లాంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి బలగం యూనిట్‌ను ప్రశంసించారు. ప్రస్తుత దైనందిన జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలు, అప్యాయతలను చక్కగా చూపించారు డైరెక్టర్‌ వేణు. మొదటి సినిమా అయినా అతని టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో సందడి చేస్తున్న బలగం ఓటీటీ రిలీజ్‌ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది.  తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కానీ ఏప్రిల్‌ మొదటి వారంలోనే బలగం ఓటీటీలోకి వచ్చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే మూవీ లవర్స్‌ కోసం ఇవాళ (మార్చి 24) అర్ధరాత్రి నుంచే ఈ అచ్చ తెలుగు సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

బలగం సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలో స్రీమింగ్ అవుతోంది. విదేశాల్లో ఉన్న తెలుగువారు సింప్లీ సౌత్‌లో ఈ మూవీ చూడవచ్చు. సుమారు 2.2 కోట్ల రూపాయలతో తెరకెక్కిన బలగం సినిమా సుమారు 20.5 కోట్లను కలెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరోలియో అందించిన స్వరాలు, కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం, మంగ్లీ తీయనైన గొంతు బలగం సినిమాకు మరింత బలాన్నిచ్చాయి. మరి థియేటర్లలో ఈ ఫీల్‌ గుడ్‌ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..