Venkatesh-Rana: కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అంతా ఓటీటీల హవా నడుస్తుంది. స్టార్ హీరో.. హీరోయిన్లు సైతం ఓటీటీల వైపే చుస్తున్నారు. ఇక ఇప్పుడు దగ్గుబాటి హీరోలు కూడా ఓటీటీలో అలరించనున్నారు. రానా – వెంకటేష్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. రానా – వెంకటేష్ కలిసి నటించబోతున్నారని చాలాకాలంగా ఫిలిం సర్కిల్స్‌లో వార్త చక్కర్లు కొడుతుంది. వెంకటేష్ నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి రానా కూడా వెంకీతో సినిమా చేయాలనీ చూస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. రానా వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం పని చేయనున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కోసం విక్టరీ వెంకటేష్ – రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తారని ఆ మధ్య సురేష్ బాబు హింట్ ఇచ్చారు.
ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా వస్తున్న ఈ సిరీస్‌కు ”రానా నాయుడు” అనే టైటిల్‌ను కంఫర్మ్ చేశారు . ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తారు. ఈ సిరీస్ కోసం వెంకటేష్ – రానాలతో చేసిన లుక్ టెస్ట్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో దగ్గుబాటి హీరోలిద్దరూ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :