
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ప్రస్తుతం వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అలా ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, డ్రామా, హారర్, థ్రిల్లింగ్.. ఇలా అన్నీ ఆంశాలు ఉండడంతో ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ థ్రిల్లింగ్ సిరీస్ కు పదికి 7.5 రేటింగ్ రావడం విశేషం. ఈ సిరీస్ విషయానికి వస్తే.. 1998లో శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఈ గ్రామంలోని అమ్మాయిలు వరుసగా అదృశ్యమవుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో ఊరికి దూరంగా అడివిగుట్ట వైపు వెళ్లే యువతులందరూ కనిపించకుండా పోతారు. దీంతో గ్రామస్తులందరూ భయపడిపోతారు. అసలు అమ్మాయిలందరూ ఏమైపోయారు? గ్రామంలో ఎందుకిలా జరుగుతోంది? అన్న మిస్టరీని ఛేదించేందుకు ఒక లేడీ కానిస్టేబుల్ రేపల్లెకు వస్తుంది. అయితే ఈ పోలీసమ్మ బల్లిని చూస్తేనే భయపడేరకం. మరి అలాంటి పోలీసమ్మ అమ్మాయిల మిస్సింగ్ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ ప్రయాణంలో ఆమెకు తెలిసిన సంచలన విషయాలు ఏంటి? కనిపించకుండా పోయిన అమ్మాయిలందరూ ఏమైపోయారు? దీని వెనక ఉన్నది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లింగ్ సిరీస్ ను చూడాల్సిందే.
బ్లాక్ మ్యాజిక్, అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీతో తెరకెక్కిన ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ సిరీస్ పేరు కానిస్టేబుల్ కనకం. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ లో అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారుప్రశాంత్ కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మించారు.
గురువారం (ఆగస్టు 14) నుంచి ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో స్ట్రీమింగ్ కు వచ్చిన మొదటి రోజు నుంచే ఈటీవీ విన్ సినిమాల్లో టాప్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది కానిస్టేబుల్ కనకం.
@etvwin strikes again! 💥
After back-to-back blockbusters, #ConstableKanakam makes it a HATTRICK BLOCKBUSTER! 🎯A Win Original Series@VarshaBollamma @RajeevCo
Story – Screenplay – Dialogues – Direction : @dimmalaprasanth
🎥 #SriramMukkupati
🎶 @sureshbobbili9
💵… pic.twitter.com/3wUlstPpF3— ETV Win (@etvwin) August 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి