OTT: 30 కోట్లతో తీస్తే వందల కోట్లు.. ఓటీటీలో మోస్ట్ వయలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Jan 22, 2025 | 8:48 AM

మలయాళ చిత్రసీమలో కొత్త ఒరవడి సృష్టించిన సినిమా 'మార్కో'. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట ఒరిజినల్ లాంగ్వేజ్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కూడా సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

OTT: 30 కోట్లతో తీస్తే వందల కోట్లు.. ఓటీటీలో మోస్ట్ వయలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Marco Movie
Follow us on

ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యానిమల్, కిల్ సినిమాలను మించి ఇండియాలోనే ది మోస్ట్ వయలెంట్ మూవీగా మార్కో గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ప్రియులు ఈ సినిమాను తెగ చూసేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘మార్కో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ‘మార్కో’ డిసెంబర్ 20న మలయాళం లో రిలీజ్ అయింది. కాబట్టి ఈ మూవీని 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అంటే ఈ నెల ఆఖరున లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ యాక్షన్ సినిమా ఓటీటీలోకి రావచ్చని సమాచారం.

 

ఇవి కూడా చదవండి

మార్కో సినిమాకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. అలాగే షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. కాగా మార్కో సినిమాలో మితిమీరిన హింసను చూపించారనే అభిప్రాయం ఉంది. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఈ కారణంగా ఒక వర్గం ప్రజలు ఈ యాక్షన్ మూవీని ఇష్టపడలేదు. ఇదిలా ఉంటే మార్కో సినిమా ఇప్పుడు కన్నడలోనూ రిలీజ్ కానుంది. జనవరి 31న కన్నడ భాషలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే అన్ని భాషల్లో అదరగొట్టిన మార్కో సినిమా కన్నడ భాషలో ఏ మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.

115 కోట్లతో రికార్డు..

మార్కో సినిమాలో ఉన్నీ ముకుందన్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.