Toxic OTT: యశ్ ‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? అసలేం జరుగుతోంది.. ఆ రూమర్లు నిజమేనా?
భారీ అంచనాలతో రిలీజైన రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' చిత్రం థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచింది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ రీలీజ్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచింది. ఆగస్టు 26న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా అభిమానుల అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సిక్ నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి స్టార్స్ కూడా వివిధ పాత్రలు పోషించారు. అయితే ఇంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఇదిలా ఉంటే థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన టాక్సిక్ సినిమాను కనీసం ఓటీటీలోనైనా చూడాలని యశ్ అభిమానులు చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే థియేట్రికల్ రిలీజై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా టాక్సిక్ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. మొదట్లో ‘టాక్సిక్’ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో ప్రసారం అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని రూమర్లు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. సెప్టెంబర్ తో పాటు అక్టోబర్ నెలల సినిమాల స్ట్రీమింగ్ జాబితాల్లో టాక్సిక్ సినిమా పేరు కనిపించలేదు. దీనిపై అటు చిత్ర బృందం గానీ, ఇటు ఓటీటీ సంస్థలు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
ఇదిలా ఉంటే టాక్సిక్ ఓటీటీ డీల్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరలవుతోంది. థియేటర్లలో ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసరికి ఓటీటీ డీల్ ఆఫర్ భారీగా తగ్గిపోయిందని తెలుస్తోంది. మొదట రూ.200 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే థియేటర్ రెస్పాన్స్ తర్వాత ఏకంగా రూ.30 కోట్లకు పడిపోయినట్లు సమాచారం. కానీ ఇప్పుడు ఆ రూ.30 కోట్లు కూడా వెచ్చించలేమని ఓటీటీలు ముందుకు రావడం లేదని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.
టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రవి బ్రసూర్ ఈ సినిమాక స్వరాలు సమకూర్చారు.
టాక్సిక్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




