AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie : సొంత ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా తీసిన సినిమా.. ఓటీటీలో హై డిమాండ్ ఉన్న మూవీ.. ఒక్కో సీన్ చూస్తే వణుకుపుట్టాల్సిందే..

ఒకవైపు గుండెల్లో భయం పుడుతుంది. ఒంటరిగా ఉండాలంటేనే వణికిపోతుంటారు. అయినప్పటికీ హారర్ సినిమాలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఓటీటీలో హారర్ సినిమాలు తెగ ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమాను డైరెక్టర్ ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే తీశారు. అంతేకాదు.. ఇందులో కనిపించినవారికి సైతం తాము నటిస్తున్నామన్నా సంగతే తెలియదు.

Horror Movie : సొంత ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా తీసిన సినిమా.. ఓటీటీలో హై డిమాండ్ ఉన్న మూవీ.. ఒక్కో సీన్ చూస్తే వణుకుపుట్టాల్సిందే..
Paranormal Activity
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2026 | 8:04 AM

Share

భయాన్ని చూడటానికి డబ్బు చెల్లించే విషయంలో అమెరికన్లు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడ ప్రతి వారం కనీసం రెండు హారర్ సినిమాలు విడుదలవుతాయి. అయితే అమెరికాలో విడుదలైన ఓ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా, అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు అర్జించిన హారర్ సంచలనం “పారానార్మల్ యాక్టివిటీ” (Paranormal Activity). ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో నిలుస్తూ, డిజిటల్ వీక్షకులను సైతం వణికిస్తోంది. 2007లో ఓరెన్ పెలి అనే స్వతంత్ర దర్శకుడు కేవలం $15,000 (సుమారు ₹12 నుండి ₹13 లక్షలు) బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తన సొంత ఇంట్లోనే చిత్రీకరించారు. ఎటువంటి భారీ గ్రాఫిక్స్, అగ్ర నటీనటులు లేకుండా కేవలం ‘ఫౌండ్ ఫుటేజ్’ (హోమ్ కెమెరా ద్వారా రికార్డ్ చేసినట్లు చూపే) విధానంలో చాలా సహజంగా దీనిని రూపొందించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు $193 మిలియన్లు (సుమారు ₹1600 కోట్లకు పైగా) వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ‘రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్’ (పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభం) సాధించిన చిత్రంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

కథ విషయానికి వస్తే..

ఒక యువ జంట (కేటీ, మీకా) తాము కొత్తగా చేరిన ఇంట్లో ఏదో అదృశ్య శక్తి తిరుగుతోందని అనుమానిస్తారు. రాత్రి వేళల్లో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బెడ్‌రూమ్‌లో ఒక వీడియో కెమెరాను అమర్చుతారు. ఆ కెమెరాలో రికార్డ్ అయిన భీతిగొలిపే వింత సంఘటనల సమాహారమే ఈ సినిమా. సాధారణంగా హారర్ సినిమాల్లో కనిపించే దయ్యాల రూపాలు, పెద్ద పెద్ద శబ్దాలు ఇందులో ఉండవు. కేవలం తలుపులు దానంతట అవే కదలడం, అడుగుల శబ్దాలు, బెడ్‌షీట్ పైకి లేవడం వంటి నిశ్శబ్ద భయానక వాతావరణమే ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతుంది. మన ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందేమో అన్నంత సహజమైన భయాన్ని ఈ చిత్రం కలిగిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

ప్రస్తుతం ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ వీడియో, పారామౌంట్ ప్లస్ వంటి ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ అవుతూ హారర్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో మిస్ అయిన నేటి తరం యువత, ఇంట్లోనే ఒంటరిగా చీకట్లో ఈ సినిమాను చూస్తూ సరికొత్త థ్రిల్‌ను అనుభూతి చెందుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అత్యధిక వ్యూస్‌తో ఈ క్లాసిక్ హారర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. హారర్ చిత్రాల అభిమానులు తప్పక చూడాల్సిన మాస్టర్‌పీస్ ఇది.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

Follow Us