
ఈ వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో దూసుకపోతోంది. భారీ వ్యూస్ డిజిటల్ స్ట్రీమింగ్ పై సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రస్తుతం థియేటర్లు అయినా, ఓటీటీలో అయినా సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్, డివోషనల్ అంశాలతో కూడిన కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా సేమ్ ఇలాంటి జాబితాలోకే వస్తోంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏదనుకుంటున్నారా? తెలుగు టీవీ తెరపై చెరగని ముద్ర వేసిన సీరియల్స్ లో మర్మదేశం ఒకటి. ఇప్పటి ఆడియెన్స్ కు దీని గురించి తెలియకోవచ్చు కానీ 90’స్ కిడ్స్ కు ఈ హారర్ స్టోరీ బాగా పరిచయమే. అప్పట్లో బుల్లితెర ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ హారర్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ‘మర్మదేశం’ కథను ఇప్పుడు వీరభద్రుని రహస్యం పేరుతో రీక్రియేట్ చేశారు. ఫస్ట్ సీజన్ లో భాగంగా ఇప్పటివరకు 30 ఎపిసోడ్స్ రీలీజ్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ దాదాపు 300 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసిందని జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కాగా ఇదే క్రమంలో వీరభద్రుని రహస్యం’ సీజన్ 1 పార్ట్ 2 స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రతి బుధవారం పార్ట్ 2లో ఐదేసి ఎపిసోడ్స్ చొప్పున ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నట్టు తెలిపారు. కాగా డివోషినల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘వీరభద్రుని రహస్యం’ వెబ్ సిరీస్‌లో రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమగాని శ్రీవర్థన్ రెడ్డి దర్శకత్వం వహించారు. డివోషనల్ మిస్టరీ సిరీస్‌గా తెరకెక్కింది. జీ5 సమర్పణలో కల్కి రాజా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.
Ee kathaku mugimpu enti? #VeerabhadruniRahasyam Season 1, Part 2
Premieres September 9th, only on Telugu Zee 5. #VeerabhadruniRahasyamOnZee5#TeluguZee5 #Marmadesam #TeluguZee5Original pic.twitter.com/otPaBdWi1A— ZEE5 Telugu (@ZEE5Telugu) September 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి