Kalinga Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Sep 29, 2024 | 10:22 AM

ఇక ఇందులో ధృవ వాయు జోడిగా ప్రగ్యా నయన్ కథానాయికగా నటించగా.. మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలకపాత్రలు పోషఇంచారు. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ హారర్ కామెడీ డ్రామా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Kalinga Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Kalinga Movie
Follow us on

హారర్ సినీ ప్రేమికులకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వరంగా మారాయి. ఎప్పటికప్పుడు హారర్, మర్డరీ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీసుకువస్తున్నాయి. ఇతర భాషలలో భారీ విజయాలను అందుకున్న హారర్ కథలను తెలుగు అడియన్స్ ముందుకు కూడా తీసుకువస్తుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. కొన్ని రోజులుగా అడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే థియేటర్లలో విడుదలైన తెలుగు హారర్ మూవీని అందుబాటులోకి తీసుకువస్తుంది. అదే కళింగ. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఆహా ఓటీటీలో ఈ మూవీ అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ధృవవాయు హీరోగా నటించారు. అలాగే ఈ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించారు.

ఇక ఇందులో ధృవ వాయు జోడిగా ప్రగ్యా నయన్ కథానాయికగా నటించగా.. మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలకపాత్రలు పోషఇంచారు. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ హారర్ కామెడీ డ్రామా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

కథ విషయానికి వస్తే.. కళింగ ఊరి పొలిమేరను దాటి అడవిలోకి వెళ్లినవాళ్లు ఎవరూ ప్రాణాలతో తిరిగిరారు. ఆ ఊరికి చెందిన లింగ (ధవృవాయు) ఓ అనాథ. సారా కాస్తూ తనకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవిస్తుంటాడు. ఆ ఊరికే చెందిన పద్దు (ప్రగ్యా నయన్)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ వీరిద్దరి ప్రేమ పద్దు తండ్రి (మురళీధర్ గౌడ్)కు నచ్చదు. దీంతో ఊరిపెద్ద (ఆడుకాలం నరేన్) వద్ద తనఖాలో ఉన్న లింగ పొలం విడిపించుకుంటేనే ఇద్దరి పెళ్లి జరిపిస్తానని కండీషన్ పెడతాడు. ఊరిపెద్ద తమ్ముడు బలితో లింగకు గొడవలు ఉండడంతో అతడి పొలానికి బదులుగా అడవి దగ్గరలోని భూమిని రాసిస్తాడు ఆ ఊరిపెద్ద. తమ పొలం కోసం పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన లింగకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అసలు ఆ అడవి మిస్టరీ ఏంటీ ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.