
ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తుంటాయి. అలా ఈ ఆదివారం (డిసెంబర్ 07) కూడా ఓ కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇది కేవలం మూడు పాత్రల చుట్టూ సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. రిషికేష్వర్ యోగి సమర్పించిన ఈ సినిమాకు కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించారు. అలాగే, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమాలో రావణ్, చాందినీ కీలక పాత్రలు పోషించారు. సినిమా కథ మొత్తం వీరిద్దరి చుట్టే తిరుగుతుంది. స్టోరీ విషయానికి వస్తే.. రావణ్, చాందిని బాగా అప్పుల్లో కూరుకుపోతారు. బ్యాంక్ వాళ్లు అప్పులు క్లియర్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పుల నుంచి బయటపడేందుకు రావణ్ ఒక ప్లాన్ వేస్తాడు. చాందిని తండ్రిని చంపేస్తే అతని నుంచి ఆస్తి వస్తుందని స్కెచ్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చాందినీ ముందు వద్దని వారిస్తుంది. కానీ చివరకు ప్రియుడి మాటలకు తలొగ్గుతుంది. ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేందుకు ఒప్పుకుంటుంది. ప్లాన్ ప్రకారం కాఫీలో తండ్రికి విషం పెట్టి చంపుతుంది చాందిని. మరి ఆ తర్వాత ఏమైంది? రావణ్, చాందినీల ప్లాన్ సక్సెస్ అయ్యిందా? ప్రియుడికి తెలియకుండా చాందిని వేసిన ప్లాన్ ఏంటి? రావణ్ ఏమయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ కథా సుధా ఓటీటీ వీక్లీ సిరీస్‌లో భాగంగా ప్రతివారం ఒక సినిమా స్ట్రీమింగ్ కు వస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఈ ఆదివారం కూడా ఘటన అనే సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. కలర్ ఫొటోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చాందీని రావు ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. ఘటన సినిమాకు కథ, డైలాగ్స్‌ను అనుదీప్ పోటునుక రాశారు. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. కాగా ఈటీవీ విన్ కథా సుధాలో ఫోర్ టేల్స్‌లో భాగంగా ఘటన ఓటీటీ రిలీజ్ అయింది. నిజానికి ఈ ఘటన రెండు, మూడు వారాల ముందే స్ట్రీమింగ్ కు రావాల్సింది. అయితే ఎందుకో లేట్ అయ్యింది. ఎట్టకేలకు ఆదివారం నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈటీవీ విన్ లో ఘటన సినిమా స్ట్రీమింగ్..
One incident. Many truths.
Ghatana explores how perspective shapes reality, inspired by the Rashomon effect.
The story now unfolds… Streaming NOW on @etvwin. @Katha_Gani @rishikeshwary @MeSureshK @RaavanNitturu @KGFFILMS123 @vishal_music2000 @akshayvasuri @niranjandasdop… pic.twitter.com/EVkRee5sf6— ETV Win (@etvwin) December 7, 2025
People’s behaviour often reflects how they are treated…
The Rashomon effect comes alive in GHATANA, where one truth is seen through many eyes.
✨ Premieres December 7
only on @etvwin.@Katha_Gani @rishikeshwary @MeSureshK @RaavanNitturu @KGFFILMS123 @vishal_music2000… pic.twitter.com/18osKcAl3o— ETV Win (@etvwin) December 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .