
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బూట్ కట్ బాల రాజు. శ్రీ కోనేటి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్‌లో మేఘ లేఖ హీరోయిన్‌గా నటించింది. సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరో సయ్యద్ సొహైల్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం, ప్రమోషన్లు గట్టిగా నిర్వహించడంతో బూట్ కట్ బాలరాజుపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సినిమా కథ బాగున్నప్పటికీ, ఎంటర్ టైన్మెంట్ మస్త్ గా ఉన్నప్పటికీ కొత్త దనం లేకపోవడంతో బూట్ కట్ బాలరాజు యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో బూట్ కట్ బాలరాజు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి సొహైల్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన బూట్ కట్ బాలరాజు సినిమాను గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై సోహైల్ నిర్మించాడు. పేద, ధనిక అంతరాలకు కాస్త కామెడీ టచ్ ఇచ్చి ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీ కోనేటి. సినిమాలోకామెడీ కూడా సూపర్బ్ గా ఉందని కామెంట్లు వినిపించా యి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో హీరో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. మరి ఓటీటీలోనైనా బూట్ కట్ బాలరాజుకు మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.
Experience rollercoaster of emotions and laughter✨
Here’s The Theatrical Trailer of #BootcutBalaraju.
In Cinemas from FEB 2nd.#BootcutBalarajuOnFeb2nd@RyanSohel #Meghalekha @sreekoneti1 #MdPasha #Globalfilms @BootcutBalaraju @SonyMusicSouth pic.twitter.com/YkWAfKPG1R
— Syed Sohel Ryan (@RyanSohel) January 24, 2024
Blockbuster Public Response for #BootcutBalaraju!💥
Watch this ultimate hilarious entertainer in Cinemas near you!
Book your tickets now!
🎟️ https://t.co/vuIk4WAWQV#BlockbusterBootcutbalaraju@RyanSohel #Meghalekha @sreekoneti1 #MdPasha #Globalfilms @BootcutBalaraju… pic.twitter.com/onfe94h2hE— Syed Sohel Ryan (@RyanSohel) February 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.