Jai Bhim: తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సూర్య. ఇటీవలే ఆకాశం నీ హద్దు రా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సుధ కొంగరు దర్శకత్వంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకాలేకపోయింది. ప్రముఖ ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు జై భీమ్ అనే సినిమాతో రాబోతున్నాడు సూర్య. టీ జే జ్ఞాన్వెల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో జై భీమ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుగా తీసుకురానున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇటీవలే విడుదలైన ఏ ఈసినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో సూర్య లాయర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆదివాసుల కోసం పోరాడే లాయర్ కథ అని అర్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్,మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఆదివాసులకోసం ఓ లాయర్ చేసిన పోరాటాన్ని చూపించారు. ఇక ఈ సినిమా ఓ రియల్ హీరో కథ అని తెలుస్తుంది. 1993 లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అప్పట్లో ఆ మహిళ కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూర్య అభిమానులు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :