Project Z OTT: ఊహించని ట్విస్టులతో ప్రాజెక్ట్ Z.. ఓటీటీలో ఒక్క రోజులోనే టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Jun 01, 2024 | 9:17 PM

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ జెడ్. 2017లో తమిళ్ లో విడుదలై సంచలన విజయం సాధించిన మాయావన్ తెలుగు వెర్షన్ ఇది. ఇటీవలే థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసింది.

Project Z OTT: ఊహించని ట్విస్టులతో ప్రాజెక్ట్ Z.. ఓటీటీలో ఒక్క రోజులోనే టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
Project Z Movie
Follow us on

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ జెడ్. 2017లో తమిళ్ లో విడుదలై సంచలన విజయం సాధించిన మాయావన్ తెలుగు వెర్షన్ ఇది. ఇటీవలే థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. అయితే ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ నేపథ్యంలో సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ జెడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా శుక్రవారం ( మే 31) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఓటీటీలో సందీప్ కిషన్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు, సందీప్ కిషన్, లావణ్య తదితరుల నటన ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ను అందిస్తున్నాయి. దీంతో ఆహా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ప్రాజెక్ట్ జెడ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రమే ఆహాలో స్ట‍్రీమింగ్ అవుతోంది.

సీవీ కుమార్ తెరకెక్కించిన ప్రాజెక్ట్ – Z సినిమాలో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ మరో కీలక పాత్రలో మెరిశారు. అలాగే ఇటీవల కన్నుమూసిన దివంగత నటుడు డేనియల్ బాలాజీ, జయప్రకాష్, దర్శకుడు కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మనిషికి మరణం అనేదే లేకుండా చేసేందుకు జ‌రుగుతోన్న ప‌రిశోధ‌న‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించారు. దీనికి కాస్త క్రైమ్, సస్పెన్స్ అంశాలను మిళితం చేయడంతో సినిమాకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మరి థియేటర్ లో ప్రాజెక్ట్ జెడ్ ను మిస్ అయ్యారా? అయితే ఈ వీకెండ్ లో ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్..

ఇవి కూడా చదవండి

 

ఆహాలో  స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి