
ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా అలరించిన సర్కార్ షో మళ్లీ వస్తోంది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలతో క్విజ్ కాన్సెప్ట్ తో సాగే ఈ ప్రోగ్రామ్ ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చిన సర్కార్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు సర్కార్ సీజన్ 5 కు రంగం సిద్ధమైంది. ఈ ఓటీటీ షో మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించాడు. గత నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సెలబ్రిటీ గేమ్ షో సహజంగానే నెక్ట్స్ లెవెల్ కు వెళ్లి పోయింది. ఐదో సీజన్ ను కూడా సుడిగాలి సుధీరే హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే రిలీజైన సర్కార్ సీజన్ 5 గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. తాజాగా సర్కార్ సీజన్ 5 ప్రోమో రిలీజైంది. ఎప్పటి లాగే సుధీర్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.
గతంలో అనన్య నాగళ్ళ, సుహాస్, కాజల్, నందిని రెడ్డి, మాళవికా నాయర్, బ్రహ్మాజీ, అల్లరి నరేశ్, నిహారిక కొణిదెల, సదా, కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, నవదీప్ వంటి క్రేజీ హీరో, హీరోయిన్లు ఈ షోకు హాజరయ్యారు. తమ ఆట, పాటలతో అలరించారు. ఇప్పుడు ఐదో సీజన్ కూడా స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా రానున్నారు. పొలిమేర హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, కోర్టు సినిమా హీరో, హీరోయిన్లు హర్ష్ రోహన్, శ్రీదేవి అలాగే నైన్టీస్ వెబ్ సిరీస్ ఫేమ్ వాసంతిక లాంటి సెలబ్రిటీలు సర్కార్ సీజన్ 5 లో సందడి చేయనున్నారు. మొత్తానికి గ్లింప్స్, ప్రోమోతోనే సర్కార్ సీజన్ 5 పై ఆసక్తి రెట్టింపయ్యింది.
The OG entertainer is back! 🔥
This is Sudheer’s playground of madness & full-on entertainment 😏
Get ready for non-stop entertainment! 🙌🏻
Watch #Sarkaar5 from June 6 , 7 PM only on #aha pic.twitter.com/7GmXw4Y5NZ
— ahavideoin (@ahavideoIN) June 2, 2025
జూన్ 6న సాయంత్రం 7 గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అలాగే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రానుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.