AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫస్ట్ లవ్ బ్రేకప్.. 14 ఏళ్ల ప్రేమ.. వేరే వాళ్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది..

సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై హాస్య నటుడిగా, యాంకర్ గా తనదైన ముద్ర వేశాడు. మరోవైపు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే టీవీ ఆట ప్రోగ్రామ్ కు యాంకరింగ్ చేస్తున్న సుధీర్.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికపై ప్రసారమవుతున్న సర్కార్ సీజన్ 6కు హోస్టింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ లేటేస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫస్ట్ లవ్ బ్రేకప్.. 14 ఏళ్ల ప్రేమ.. వేరే వాళ్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది..
Sudigali Sudheer
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2026 | 6:58 AM

Share

బుల్లితెరపై హాస్య నటుడిగా, యాంకర్ గా తనదైన ముద్ర వేశాడు సుడిగాలి సుధీర్. మొదట్లో మ్యాజిక్ షోస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమా గోట్. దివ్య భారతి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఓవైపు వెండితెరపై నటుడిగా సందడి చేస్తున్న సుధీర్.. ఇటు బుల్లితెరపై యాంకర్ గా అలరిస్తున్నారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ సీజన్ 6కు హోస్టింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ షోకు యాంకర్ విష్ణుప్రియ సైతం యాడ్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఇకపై ఈ షోను నడిపించనున్నారు. గతంలో వీరిద్దరు కలిసి పోవే పోరా షో చేసిన సంగతి తెలిసిందే.

ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

తాజాగా విడుదలైన ప్రోమోలో పాపం ప్రతాప్ మూవీ టీమ్ సందడి చేసింది. తిరువీర్, స్నేహ, ప్రసాద్ బెహ్రా, రవి ఆంటోనీలు ఎంటర్టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో చిత్రయూనిట్ ను సుధీర్ ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరు తమ తొలి ప్రేమ గురించి చెప్పాలని అడగ్గా.. మీరు చెప్పండి అంటూ తిరువీర్ ప్రశ్నించాడు. దీంతో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. 14 సంవత్సరాల రిలేషన్ షిప్ కదా.. ఎందుకు బ్రేకప్ అయ్యింది అని అడగ్గా.. సుధీర్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు.

ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..

సుధీర్ మాట్లాడుతూ.. “14 ఏళ్లు రిలేషన్ షిప్.. స్కూల్ నుంచే పరిచయం, ప్రేమ. నేను ఇక్కడే హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాను. తను వేరే వాళ్లను పెళ్లి చేసుకుంది అని తెలిసిందే. ఎందుకు అని అడిగాను. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. డిస్ట్రబ్ చేయకు అంది. ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నక్లెస్ రోడ్ లో అరుస్తూ పరిగెత్తాను” అంటూ ఆ రోజు జరిగిన సంఘటనను చెప్పుకొచ్చాడు. గతంలోనూ తన ప్రేమ, బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్..ప్రస్తుతం తన మీద తన ఫ్యామిలీ ఆధారపడి ఉందని… బ్రేకప్ చెప్పకపోతే ఇంతమంది ప్రేమ దొరికేది కాదేమో అని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us
ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.. ఆ జిల్లాలోనే 8 మందికి..
ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.. ఆ జిల్లాలోనే 8 మందికి..
డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. లింక్ ఇదిగో
డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. లింక్ ఇదిగో
ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా?
ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా?
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!
నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
భారత్ కొంపముంచుతోన్న గిల్, గంభీర్ మొండి పట్టుదల
భారత్ కొంపముంచుతోన్న గిల్, గంభీర్ మొండి పట్టుదల
బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? జాగ్రత్త
బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? జాగ్రత్త
ప్రకృతి ఒడిలో వింత జీవులు.. ఆకట్టుకుంటున్న ‘నేత చీమలు..
ప్రకృతి ఒడిలో వింత జీవులు.. ఆకట్టుకుంటున్న ‘నేత చీమలు..
'నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి' ఓ IAS అధికారి లేఖ
'నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి' ఓ IAS అధికారి లేఖ
అందరి కోసం పోరాడితే నన్ను జైల్లో వేశారు..
అందరి కోసం పోరాడితే నన్ను జైల్లో వేశారు..