గతేడాది ‘మామా మశ్చీంద్ర’ సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ ఏడాది హరోంహర సినిమాతో మన ముందుకు వచ్చాడు. ‘ది రివోల్ట్’ అన్నది ఈ మూవీ క్యాప్షన్. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించింది. సునీల్, అక్షరా గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. కేజీఎఫ్, పుష్పల స్టైల్ లో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హరోంహర రూపొందింది. టీజర్స్, ట్రైలర్స్ కొత్తగా ఉండడం, ప్రమోషన్స్ కూడా గట్టిగా నిర్వహించడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇలా భారీ అంచనాల మధ్య జూన్ 14న థియేటర్లలో రిలీజైన హరోంహర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించింది. అయితే సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నింపేయడం హరోంహర సినిమాకు కాస్త మైనస్ గా మారింది. దీంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఓవరాల్ గా యావరేజ్ గా నిలిచిన హరోంహర సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సుధీర్ బాబు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. జులై 11 నుంచి హరోంహర సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా.
‘బలవంతునికి ఆయుధం అవసరం.. కానీ బలహీనుడికి ఆయుధమే బలం’ అంటూ హరోంహర సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా పంచుకుంది ఆహా. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ హరోంహర సినిమాకు స్వరాలు సమకూర్చారు. థియేటర్లలో ఈ పవర్ ప్యాక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే మరో రెండు రోజలు ఆగండి.. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Balavanthudiki ayudham avasaram..🤨
Kaani baalaheenudiki Ayudhame balam!⚔️#HaromHara Premieres July 11th only on aha!@isudheerBabu @ImMalvikaSharma @suneeltollywood @gnanasagardwara @chaitanmusic @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/Klf0BsDStc— ahavideoin (@ahavideoIN) July 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.