గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ సినిమాలదే హవా నడుస్తోంది. వాస్తవికతకు, సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ మూవీస్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో మలయాళ సినిమాదే క్రేజ్. వీటికి మంచి ఆదరణ వస్తుండడంతో పలు ఓటీటీ సంస్థలు కూడా మలయాళ మూవీస్ నే తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇక భాషతో సంబంధం లేకుండా కొన్ని జానర్ల సినిమాలు అందరికీ నచ్చుతాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ జానర్ సినిమాలు అందరికీ నచ్చుతాయి. ఓటీటీ ఆడియెన్స్ కూడా వీటిని చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అలా మలయాళంలో రెండేళ్ల క్రితం రిలీజైన ఓ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. అదే ‘ఎలా వీజ పూంచిర’. షాహి కబీర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో షోబిన్ షబీర్, సుధీ కోప్రా, జూడ్ ఆంథోని జోసెఫ్, జిత్తూ అష్రాఫ్, గిరీశ్ మోహన్, జినేష్ చంద్రన్, రాజేష్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఎలా వీజ పూంచిర సినిమా కథ విషయానికి వస్తే.. ఈ స్టోరీ మొత్తం పోలీస్ కానిస్టేబుల్ మధు ( షోబిన్ షబీర్) చుట్టూ తిరుగుతుంది. అతను ఒకసారి డ్యూటీలో భాగంగా ఒక శవానికి కాపలా కాయాల్సి వస్తోంది. అయితే రక్తం మరకలు చూసి వేరే ప్రాంతానికి వెళ్లి మందు తాగుతాడు. ఇంతలోనే మరొక పోలీస్ ఆఫీసర్ అతనితో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్టేషన్ కు వెళతారు. అక్కడ ఉన్న వెంకయ్య మధుకు వంట చేసి పెడితే అతను తినకుండా కుక్కలకు పెట్టేస్తాడు. ఇక కొద్దీ సేపటికి ఆ ప్రాంతాన్ని చూడడానికి తన పై ఆఫీసర్ భార్య పిల్లలు వస్తారు. వారిలో ఒక అబ్బాయి మాత్రం ఎదో మర్చిపోయానంటూ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఈలోపు భారీ వర్షం కారణంగా మధు వాళ్లను స్టేషన్ కు తీసుకొస్తారు. అయితే బయటకు వెళ్లిన ఆ అబ్బాయి మాత్రం పిడుగు పాటు కారణంగా చనిపోతాడు. మరవైపు సిటీలో అక్కడక్కడ కొంతమంది అమ్మాయిల బాడీ పార్ట్స్ దొరుకుతూ ఉంటాయి. మరి మృత దేహాలు ఎవరివి? ఆ హత్యలు చేసింది ఎవరు? అనేది తెలుసుకోవాలంటే “ఎలా వీజ పూంచిర” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.