OTT Movie: ‘మల్లెపూల’ సైకో కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో నయా క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ శుక్రవారమే (జనవరి 23) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా సాగే ఈ తెలుగు మూవీ కేవలం ఒకే ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ వన్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిపోయింది.

OTT Movie: మల్లెపూల సైకో కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో నయా క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
Cheekati Lo Movie

Updated on: Jan 25, 2026 | 6:54 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జనవరి 25) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ తరహా సినిమాలకే ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఈ మూవీ గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరమైన కథ కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను అందిస్తోందీ సినిమా. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంధ్య నెల్లూరు అనే అమ్మాయి ఓ న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ స్టోరీస్‌కు యాంకర్‌గా వర్క్ చేస్తుంటుంది. టీఆర్‌పీల కోసం కాకుండా నిజాలను చూపించాలని సంధ్య ఆరాటపడుతుంది. అయితే తాను అనుకున్నట్లు న్యూస్ ఛానెల్ లేకపోవడంతో సొంతగా ఓ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. అదే సమయంలో సంధ్య ఉన్న సిటీలోనే వరుస అత్యాచారాలు, హత్యలు జరుగుతాయి. వీటిపై కూడా పాడ్ కాస్ట్ చేస్తుంది సంధ్య. దీంతో ఆ సైకో కిల్లర్ సంధ్యను కూడా వెంబడిస్తాడు. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ కు కారణమెవరు? అసలు ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? సంధ్య సైకో కిల్లర్ ను పట్టుకుందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సైకో థ్రిల్లర్ మూవీ పేరు చీకటిలో. అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల ఇందులో మెయిన్ లీడ్ చేసింది. అలాగే ప్రేమ కావాలి సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఇషా చావ్లా చాలా కాలం తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించింది. అలాగే సీనియర్ నటి ఆమని మరో కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో చీకటిలో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ వంటి 3 భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకు వచ్చేసింది చీకటిలో సినిమా.

ఇవి కూడా చదవండి

ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో చీకటిలో సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.