Jack OTT: అఫీషియల్.. ఓటీటీలోకి జాక్.. సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్యల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు మూవీ ఫేమ్ భాస్కర్ ఈ సినిమాను తెరెకెక్కించాడు.ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడీ లేటెస్ట్ మూవీ ఓటీటీలోకి రానుంది.

Jack OTT: అఫీషియల్.. ఓటీటీలోకి జాక్.. సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్యల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Jack Movie

Updated on: May 05, 2025 | 3:04 PM

‘టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం జాక్.. కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కావడం, సిద్దూ, వైష్ణవిలకు మంచి క్రేజ్ ఉండడంతో మొదటి నుంచి జాక్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగ టీజర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 10న థియేటర్లలోకి గ్రాండ్ గా అడుగు పెట్టాడు జాక్. కానీ మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అదే టాక్ కంటిన్యూ అయ్యింది. దీంతో జాక్ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే సిద్దూ, వైష్ణవిల మధ్య వచ్చే సీన్స్ యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో చాలామంది జాక్ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల వివరాలను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ‘జాక్‌’ సినిమా మే 8న ఓటీటీలో విడుదల కానుందని ‘నెట్‌ఫ్లిక్స్‌’ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుందని ఈ పోస్టర్ లో పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి

స్పై ఏజెంట్ గా సిద్దూ జొన్నలగడ్డ..

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు జాక్ సినిమాను నిర్మించారు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్ సంగీత దర్శకులుగా పని చేశారు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేసిన చేసిన ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు.మరి థియేటర్లలో జాక్ సినిమాను మిస్ అయ్యారా? అయితే సిద్దూ,వైష్ణవిల కోసం ఒకసారి ఈ మూవీపై లుక్ వేసుకోవచ్చు.

మరో మూడు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.