
టాలీవుడ్ హ్యాండ్సమ్ అండ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ మూవీ చిత్తా. సిద్ధార్థ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా తెలుగులో చిన్నాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ నటన కన్నీళ్లు తెప్పించిందంటూ రివ్యూలు వినిపించాయి. అంతకుమించి వరుసగా ప్లాఫులతో సతమతమైన హీరోకు చాలా ఏళ్ల తర్వాత ఓ మంచి హిట్ సినిమా పడింది. తెలుగులో వారం ఆలస్యంగా (అక్టో బర్ 6)న విడుదలైన చిన్నా సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న చిన్నా సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్ధార్థ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్ 17 న చిన్నా సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సిద్ధార్థ్ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ వంటి సున్నితమైన అంశాలను ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ ఎ స్‍యూ అరుణ్ కుమార్. సిద్ధార్థ్‌తో పాటు నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలు పోషించారు.
కంటెంట్‌పై నమ్మకం ఉండడంతో హీరో సిద్ధార్థ్ స్వయంగా చిన్నా సినిమాను నిర్మించారు. పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా నిర్వహించాడు. చిన్నా సినిమాకు విశాల్ చంద్ర శేఖర్, దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్ స్వరాలు అందించారు. బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సురేష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక చిన్నా సినిమా కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటాడు ఈశ్వర్ (సిద్ధార్థ్). అయితే నగరంలో చిన్న పిల్లల్ని అపహరించి అత్యాచారం చేయడం, దారుణంగా హతమార్చడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇదే సమయంలో ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీస్ స్టేషన్‌కు వెళతాడు. అలాగే ఈశ్వర్ కూతురు కూడా కిడ్నాప్ అవుతుంది. మరి ఈశ్వర్ తన అన్న కూతురును వెతికి పట్టుకున్నాడా? లేదా? అన్నది తెరమీద చూడాల్సిందే.
Tamil movie #Chithha digital arrives November 17 on @DisneyPlusHS.#ChithhaOnHotstar pic.twitter.com/rkM3Ax7V5J
— Ott Updates (@Ott_updates) November 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.