
సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో జరిగే నేరాలు, మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఓ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నూ ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన 24 గంటల్లోనే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమా కావ్య అనే ఓ గేమ్ డెవలపర్ చుట్టూ తిరుగుతుంది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఆమె పనిచేస్తుంటుంది. గేమ్ డెవలర్ గా తన పని తీరుతో మంచి పేరు సంపాదించుకుంటుంది. అయితే ఉన్నట్లుండి సోషల్ మీడియాలో కావ్యపై ట్రోలింగ్స్ మొదలవుతాయి. కొందరు పని గట్టుకుని ఆమెను టార్గెట్ చేస్తారు. ఆమెకు సంబంధించిన వస్తువులు దొంగిలించి సైబర్ నేరాలకు పాల్పడుతారు. దీంతో కావ్య ఇబ్బందుల్లో పడుతుంది. అసలు గేమ్ డెవలపర్ కావ్యను టార్గెట్ చేసింది ఎవరు? ఆమెపై ఎందుకు దాడికి పాల్పడ్డారు? డిజిటల్ ప్రపంచంలో జరిగిన నేరాలు, మోసాలను కావ్య ఎలా ఎదుర్కొంది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
సరికొత్త కథా, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే ఈ సిరీస్ పేరు.. ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్. రాజేష్ సెల్వ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సిరీస్ లో శ్రద్ధా శ్రీనాథ్ (కావ్య) ప్రధాన పాత్ర పోషించింది. సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాలా హసన్, సుభాష్ సెల్వమ్, వివియా శాంత్, ధీరజ్, హేమ తదితరులు కీ రోల్స్ పోషించారు. దీప్తి గోవింరాజన్ ఈ సిరీస్ కు కథ అందించగా.. అప్లౌజ్ సౌత్ నిర్మించింది. ప్రస్తుతం ది గేమ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం
Avanga jeikaadha game-um illa heart-um illa 🎮😍#TheGameOnNetflix pic.twitter.com/hfMF4qARRt
— Netflix India South (@Netflix_INSouth) October 4, 2025
She’s going to fight the trolls from the eye of the storm 🌀🔥 pic.twitter.com/hPGrKrP9vJ
— Netflix India South (@Netflix_INSouth) October 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.