OTT Movie: నాలుగే ఎపిసోడ్స్.. వెన్నులో వణుకు పుట్టించే జాంబీ తరహా మూవీ.. నైట్ టైమ్ లో అసలు చూడొద్దు

హారర్ థ్రిల్లర్ సినిమాలు/ వెబ్ సిరీస్ లను చూడాలంటే ఆసక్తి మాత్రమే కాదు కొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే అందులో వచ్చే కొన్ని సన్నివేశాలు భయానకంగా ఉంటాయి. అమాంతం గుండె దడని పెంచుతాయి. అంతేకాదు సినిమా/సిరీస్ పూర్తయ్యాక కూడా ఆ సీన్స్ వెంటాడుతుంటాయి.

OTT Movie: నాలుగే ఎపిసోడ్స్.. వెన్నులో వణుకు పుట్టించే జాంబీ తరహా మూవీ.. నైట్ టైమ్ లో అసలు చూడొద్దు
OTT Movie

Updated on: Jul 07, 2025 | 6:06 PM

ఈ మధ్యన సినిమా ఆడియెన్స్ ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లనే తెరకెక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన, భయంకరమైన హారర్-థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సిరీస్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఎపిసోడ్‌లు మాత్రమే ఉంటాయి. కథ విషయానికి వస్తే.. ప్రభుత్వం ఒక మారుమూల గ్రామానికి ఒక పెద్ద ప్రాజెక్టును కేటాయిస్తుంది. దీని కోసం అధికారులు అక్కడ తవ్వకం పనులు చేపడుతారు. అయితే గ్రామం పక్కన ఒక సొరంగం తవ్వడానికి వచ్చిన అధికారులను మాత్రం గ్రామస్తులు ఆపుతారు. దానికి ఒక ప్రత్యేక కారణమంటుంది. గ్రామస్తుల నిరసనను చూసి, ప్రభుత్వం సైన్యాన్ని పంపుతుంది. ఇదే క్రమంలో గ్రామస్తులను బలవంతంగా ఖాళీ చేయించడానికి ఆర్మీ కమాండర్ ఒక అవినీతి వ్యాపారవేత్తతో కలిసి కుట్ర పన్నుతాడు.

అధికారులు, పోలీసులు కలిసి సొరంగం తవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ అందులో నుంచి భయంకరమైన దయ్యాలు బయటికి వచ్చి వారిపై దాడి చేస్తాయి. ఈ దాడి చేసే సన్నివేశాలను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అంతేకాదు ఆ దయ్యాలు బ్రిటిష్ వేషధారణతో ముఖం నిండా రక్తపు చారలతో చాలా భయానకంగా ఉంటాయి. మరి చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్ పేరు ‘బేటల్’. ఇందులో వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే అహనా కుమార్ మరో కీలక పాత్రలో మెరిశాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఈ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. మొత్తం నాలుగు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ మిమ్మల్ని అంతటా భయపెడుతుంది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

బేతాల్ వెబ్ సిరీస్ పై ఒక నెటిజన్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.