ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్తో అలరిస్తున్న తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందిస్తూ డజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఇప్పుడు ఆహాలో సేనాపతి సరికొత్త వెబ్ సిరీస్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ద్వారా రాజేంద్రప్రసాద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సేనాపతి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
జీవితంలో మంచి… చెడు రెండూ చూడాలి. ఈ రెండింటి మధ్యే ఎదగాలి అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పోలీసులకు, రౌడీలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ సాధారణం వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు. ఆ తర్వాత అదే కృష్ణమూర్తి సేనాపతిగా మారతాడు అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే కృష్ణమూర్తి సేనాపతిగా ఎందుకు మారాడు.. రహస్యంగా సాగిస్తున్న అన్వేషణ ఎందుకు అనే అంశాలతో ట్రైలర్ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల, హర్షవర్దన్, రాకేందు మౌళి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్